ముంబైలో(Mumbai) జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో శ్రీదేవి(Sridevi) కూతురు జాన్వీకపూర్‌(Janhvi kapoor) ఎమోషనైంది. ఆమె తొలి చిత్రం 'ధడక్'(Dhadak) షూటింగ్ సందర్భంగా మా అమ్మ లొకేషన్‌కు వస్తానంటే తాను అడ్డుకున్నానని.. ఆమె మా నుంచి దూరమైన తర్వాత తను చేసిన పొరపాటును అర్థం చేసుకున్నానని భావోదేగ్వానికిగురైంది.

ఈ సందర్భంగా జాన్వీకపూర్‌ ప్రసంగిస్తూ మా అమ్మ వల్లనే నాకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని ఇండస్ట్రీలో టాక్‌ వచ్చిందని.. ఆమె నుంచి నేను ఎలాంటి సహాయం పొందకూడదని అనుకున్నా. శ్రీదేవిలా కాకుండా భిన్నంగా నటించి గుర్తింపు తెచ్చుకోవాలనే తపించా. నా సొంత కాళ్లపై నిలబడేందుకు.. నా సొంత టాలెంట్‌తోనే అవకాశాలు రావాలని అనుకునేదాన్నని.. అందుకే షూటింగ్‌కు(Shooting) రావొద్దని అమ్మకు చెప్పానని జాన్వీ కపూర్‌ తెలిపింది. కానీ నాలో అభద్రతాభావం ఉండేది.. అంచనాలను అందుకోలేనన్న ఒత్తిడికి(Pressure) లోనయ్యేదాన్నని చెప్పుకొచ్చింది. మా అమ్మ సలహాలను స్వీకరించేదాన్ని కాదు.. నేనేంత సంకుచిత మనస్తత్వంతో ఆలోచించానోనని తర్వాత తెలుసుకున్నానని తెలిపింది. కొంతకాలం తర్వాత తన నిర్ణయాలు తెలుసుకొని బాధపడ్డా అని తెలిపింది. అమ్మ బతికే ఉంటే ఇప్పుడు అన్ని విషయాలను తనతో పంచుకునేదానిని.. శ్రీదేవి కూతురిగా పుట్టినందుకు గర్విస్తున్నానని తెలిపింది.

జాన్వీ సినిమాల విషయానికొస్తే.. దేవర’(Devara)తో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టబోతున్నారు. జూ.ఎన్టీఆర్‌(Jr.NTR) హీరోగా నటిస్తున్నఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీ కపూర్‌ ఈ సినిమాలో తంగమ్‌ అనే పాత్రలో నటిస్తున్నారు. దేవర పార్ట్‌ 1 పేరుతో ఏప్రిల్‌ 5న విడుదల కానుంది.

Updated On 16 Dec 2023 12:51 AM GMT
Ehatv

Ehatv

Next Story