మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) గేమ్ ఛేంజర్ చిత్రం షూటింగ్ షెడ్యూల్ బిజీగా ఉన్నాడు. ఎస్.శంకర్(S. Shankar) సినిమా తర్వాత చెర్రీ బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్(Janhvi Kapoor) అనుకుంటున్నారట. ఇది రామ్ చరణ్‌కు 16వ సినిమా. ఈ చిత్రం టెక్నికల్ టీమ్ గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. హిందీలో వరుస ప్రాజెక్టులతో బీజీగా ఉన్న జాన్వీ కపూర్ ఇటు సౌత్‌లో ఎన్టీఆర్ 30లో జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR) సరసన నటిస్తోంది.

Ram Charan Buchi Babu

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో వరల్డ్ వైడ్‌గా సక్సెస్‌ను అందుకున్న రామ్ చరణ్‌కి.. స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా పల్లెటూరి నేపథ్యంలో చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఇటు డైరెక్టర్ శంకర్‌తో చేస్తున్న గేమ్ ఛేంజర్ (Game Changer) చిత్రం పూర్తి కాగానే.. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభంకానుందంటున్నారు. రామ్ చరణ్ (Ram Charan), ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం ఇది.
అయితే ఈ సినిమాలో జాన్వీ క్యారెక్టర్‌కి సంబంధించిన విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ త్వరలోనే ఒక అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ సినిమాతో చేయడం కన్ఫార్మ్ అయ్యాక.. చెర్రీకి ధన్యావాదులంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్. ఇక శంకర్ డైరెక్టర్ చేస్తున్న సినిమాలో రామ్ చరణ్ చేస్తున్న పార్ట్ పూర్తయిందంటున్నారు. మరోవైపు జాన్వీ(Janhvi) కూడా జూనియర్ ఎన్టీఆర్ సరసన ఎన్టీఆర్30లో నటిస్తోంది. కొరటాల శివ (Koratal Shiva) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ మధ్య కాలంలో సౌత్ నుంచి వస్తున్న భారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమాపై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.