మెగా బ్రదర్‌ నాగబాబు(Nagababu) మరో రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు.

మెగా బ్రదర్‌ నాగబాబు(Nagababu) మరో రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. యూట్యూబ్ చానెల్‌తో పలు విషయాలపై ఎనాలసిస్‌ చేస్తూ వచ్చిన నాగబాబు మరో చానెల్‌తో మన మందుకు రానున్నారు. 'N'మీడియా ఎంటర్‌టైన్మెంట్(N Media Entertainment) పేరుతో లోగోను కూడా ఆవిష్కరించారు. అయితే ఇది ఎంటర్‌టైన్మెంట్‌కే పరిమితం కానుందా లేదా న్యూస్‌కు కూడా వస్తుందా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇది కూడా యూ ట్యూబ్‌కే(Youtube) పరిమితం కానుందా లేదా శాటిలైట్‌ చానెలా(Satilite Channel) అనేది కూడా క్లారిటీ లేదు. అయితే ఈ చానెల్‌కు ఇప్పటికే 1 మిలియన్ సబ్‌స్క్రైబర్స్‌ కూడా వచ్చారు. నాగబాబు మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చానెల్స్‌కు కొదవలేదు. శాటిలైట్, యూట్యూబ్‌ చానెళ్లు వందలాదిగా ఉన్నాయి. ఎంటర్‌టైన్మెంట్ చానెళ్లు కూడా చాలానే ఉన్నాయి. న్యూస్‌ చానెళ్లు కూడా బోలెడన్ని ఉన్నాయి. న్యూస్ చానెళ్లు శాటిలైట్, యూట్యూబ్‌ వేదికగా పనిచేస్తూ ఏదో ఒక పార్టీకి కొమ్ముకాస్తున్నాయి. పార్టీలైన్‌, చానెళ్ల అధినేతల సొంత ఎజెండా ప్రకారం పనిచేస్తున్నాయి. న్యూట్రల్ చానెల్‌ లేదనే చెప్పాలి. అయితే ఆల్ ఆఫ్ సడెన్‌గా నాగబాబుకు ఇప్పుడు మీడియాపై ఫోకస్‌ పడడంతో ఇది చర్చనీయాంశమైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడానికి జనసేన కారణమని 21 మంది ఎమ్మెల్యేలు, భారీ ఓటింగ్ శాతం ఉన్న జనసేన కోసం ఓ చానెల్ ఉండాలని నాగబాబు భావిస్తున్నారట. జనసేన వాదం బలంగా వినిపించే ఒక చానెల్‌ను ఏర్పాటు చేయాలని నాగబాబు ఆలోచన. నాగబాబు మీడియా రంగంలోకి ప్రవేశించడంతో జనసేన అభిమానులు, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్‌కే పరిమితమవుతారని, భవిష్యత్తులో పొలిటికల్‌ న్యూస్‌ కూడా ఉంటుందని చర్చ జరుగుతోంది. రాజకీయంగా బలం పెంచుకోవాలన్న ఉద్దేశంతోనే మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Eha Tv

Eha Tv

Next Story