సౌత్ ఇండియన్ సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన తాజా సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా తమన్నా హీరోయిన్ గా నటించింది. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించగా..యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ సందడి చేశారు. కన్నడ న‌టుడు శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మలయాళ స్టార్ మోహన్ లాల్ (Mohanlal తో పాటు.. శివగామి.

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదరు చూస్తున్న ఫ్యాన్స్ కు జైలర్ తో విజ్యువల్ ట్రీట్ ఇచ్చాడు తలైవా. జైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. ఈమూవీ పాజిటీవుటాక్ తో దూసుకుపోతోంది. ఈక్రమంలో థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ సందడితో పాటు.. గొడవలు కూడా తప్పడంలేదు.

సౌత్ ఇండియన్ సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన తాజా సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా తమన్నా హీరోయిన్ గా నటించింది. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించగా..యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ సందడి చేశారు. కన్నడ న‌టుడు శివరాజ్ కుమార్ (Shiva Raj kumar), మలయాళ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) తో పాటు.. శివగామి.. రమ్య కృష్ణ కూడా కీలక పాత్రల్లో కనిపించి మురిపించారు. ఈమూవీ నిన్న (ఆగ‌స్టు 10) ప్రపం వ్యాప్తంగా ఆడియన్స్ మందుకు వచ్చి.. సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది.

కాగా ఈ సినిమా రిలీజ్ సందర్భంగా.. తమిళ, తెలుగు రాష్ట్రాల థియేటర్లలో సందడి వాతావరణం నెలకొంది. తమిళ నాట అయితే.. పండగ వాతావరణం నెలకొంది. స్కూల్స్, ఆఫీసలకుసెలవులు కూడా ఇచ్చేశారు. అదిరజనీకాంత్ అంతే. ఈ సంద‌ర్భంగా కొన్ని చోట్ల ర‌జనీకాంత్ అభిమానులు థియేట‌ర్ల వ‌ద్ద ప‌టాకులు కాల్చారు. పూజ‌లు చేయ‌డంతో పాటు ర‌జనీకాంత్ క‌టౌట్లకు పూల దండ‌లు వేశారు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. సినిమా పై నెగిటివ్ రివ్యూ ఇచ్చినందుకు ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను రజనీ ఫ్యాన్స్ చిత‌క్కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతోంది.

ఇక ఈ సంఘటన తమిళనాడు చెన్నైలో జరిగింది. క్రోమ్ పేట్ ప్రాంతంలోని వెట్రి థియేటర్ వ‌ద్ద సినిమా ఎలా ఉంది అంటూ విలేక‌రులు రివ్యూలు తీసుకుంటుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇద్ద‌రు వ్య‌క్తులు సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. దీంతో కోపంతో ఊగిపోయిన ర‌జనీకాంత్ అభిమానులు వారిద్ద‌ని కొట్టారు. వీరిద్దరూ విజయ్ అభిమానులనీ.. తలైవర్ సినిమాను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫ్యాన్స్ ఆరోపించారు. దాంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాట సంచలనంగా మారింది.

Updated On 11 Aug 2023 6:07 AM GMT
Ehatv

Ehatv

Next Story