జగతిపతి బాబు (Jagapathi Babu) హీరోగా చేసి కొంతకాలం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు విలన్‌గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. లెజెండ్(legend), అరవింద సమేత వీరరాఘవ(aravinda sametha veera raghava) వంటి సినిమాలతో ది బెస్ట్ విలన్‌గా జనాల్లో మళ్లీ జగపతి బాబు ఒక ముద్ర వేసుకున్నాడు. అయితే తాజాగా ఆయన విలన్ రోల్ చేసిన మరో సినిమా రుద్రంగి (Rudrangi) టీజర్ రిలీజ్ అయింది. ఈ పీరియాడిక్ యాక్షన్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో జగ్గుభాయ్ సీన్స్ జనాలను ఆకట్టుకుంటున్నాయి.
జగతిపతి బాబు (Jagapathi Babu) హీరోగా చేసి కొంతకాలం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు విలన్‌గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. లెజెండ్(legend), అరవింద సమేత వీరరాఘవ (aravinda sametha veera raghava) వంటి సినిమాలతో ది బెస్ట్ విలన్‌గా జనాల్లో మళ్లీ జగపతి బాబు ఒక ముద్ర వేసుకున్నాడు. అయితే తాజాగా ఆయన విలన్ రోల్ చేసిన మరో సినిమా రుద్రంగి (Rudrangi) టీజర్ రిలీజ్ అయింది. ఈ పీరియాడిక్ యాక్షన్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో జగ్గుభాయ్ సీన్స్ జనాలను ఆకట్టుకుంటున్నాయి. జగతిబాబు విలనిజం వేరే లెవెల్ అంటున్నారు ఆడియన్స్. 'ఇండిపెండెంట్ బానిసలకు కాదు రాజులకు', గాడు బలవంతుడురా కానీ నేను భగవంతుడిని రా'అంటూ జగ్గుభాయ్ చెప్పే డైలాగ్స్ గూజ్బమ్స్ తెప్పిస్తున్నాయంటున్నారు జగ్గూ ఫ్యాన్స్. అయితే ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మమతా మోహన్ దాస్(Mamta Mohandas) మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. చాలా కాలం వరకు గ్యాస్ తీసుకున్న ఈ భామ ఈ చిత్రంలో యాక్టింగ్ అదరగొట్టేసింది.
అజయ్ సామ్రాట్ (Ajay Samrat) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక ఇందులో మమతా మోహన్ దాస్ రాణి(Mamta Mohandas)గా తన ప్రజలకు ఓ వైపు సేవలందిస్తూనే.. అణగదొక్కేవాళ్లపై ఝాన్సీ లక్ష్మీభాయ్‌లా విరుచుకుపడుతూ మట్టికరిపిస్తుంది. ఇక మమత (Mamatha) ఫ్యాన్స్ కూడా రీఎంట్రీతో అదరగొట్టేశావ్ అంటున్నారు. చిత్రానికి నోఫెల్ రాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్సెలెంట్ అని చెప్పాలి. ఈ చిత్రంలో గణవి లక్ష్మణ్, విమలా రామన్, కాలకేయ ప్రభాకర్, సదానందం నటీనటులుగా ఉన్నారు. అయితే ఈ సినిమా జగపతిబాబు కెరీర్లో టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ చిత్రాన్ని మే 26న విడుదల చేయనున్నారు.