ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు(Jagapathi babu ) తన పుట్టిన రోజు(Birthday ) సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశాడు. అయితే త‌న పుట్టినరోజును సెలెబ్రేట్‌ చేసుకునే సమయంలో తన అభిమానులను సరదా ప్రశ్నలు అడిఆడు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ ”ఎలాగోలా పుట్టేశాను. సిగ్గు లేకుండా అడుగుతున్న, మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి.

ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు(Jagapathi babu ) తన పుట్టిన రోజు(Birthday ) సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశాడు. అయితే త‌న పుట్టినరోజును సెలెబ్రేట్‌ చేసుకునే సమయంలో తన అభిమానులను సరదా ప్రశ్నలు అడిఆడు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ ”ఎలాగోలా పుట్టేశాను. సిగ్గు లేకుండా అడుగుతున్న, మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. రెండోది ఎక్కువ‌సేపు ఆలోచించకుండా తొందరగా డిసైడ్ చేయండి. ఈ రెండిట్లో ఏది కొట్టమంటారు” అని ఒక‌వైపు మిల్క్‌ బాటిల్ ఇంకోవైపు గ్లెన్‌ఫ్లిడిచ్‌ బాటిల్‌తో ఫొటో దిగి పోస్ట్ చేశాడు. దీంతో జగపతిబాబు పెట్టిన ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో(SOcial media) వైర‌ల్‌గా మారింది. దీంతో నెటిజన్లు పలరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు పాల తాగాలని సూచించగా మరికొందరు మీరు ఆల్రెడీ ఏం కొట్టాలో డిసైడయ్యారు అని కామెంట్స్‌ చేస్తున్నారు.

అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు జగపతిబాబు మంచి ఫాంలో ఉన్నాడు. ఒక‌ప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన జ‌గ‌ప‌తి బాబు విలన్‌ క్యారెక్టర్స్, స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ పాత్ర పోషించాడు. బాల‌కృష్ణ న‌టించిన లెజెండ్ సినిమాతో విల‌న్‌గా మారిన ఈ స్టార్ హీరో ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేశాడు. ఏ తరహా పాత్రలోనయినా ఇమిడిపోతూ తనలో నటుడిని మనకు పరిచయం చేస్తున్నాడు. జగపతిబాబు సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తన పోస్టులతో నెటిజన్లను అలరిస్తుంటాడు. తాజాగా తన పుట్టిన రోజున ఈ పోస్టు పెట్టి మరోసారి వార్తలో నిలిచాడు.

Updated On 12 Feb 2024 4:59 AM GMT
Ehatv

Ehatv

Next Story