వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ(RGV) ప్రస్తుతం రెండు సినిమాలు తీస్తున్నారు. ఆ రెండు సినిమాలు ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి లబ్ధి చేకూర్చడానికే ఈ సినిమాలు రూపొందిస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రామ్‌గోపాల్ వర్మ కూడా ఇదే మాట అంటున్నారు. ఈ సినిమాలు కచ్చితంగా వైసీపీకి(YSRCP) అనుకూలంగా ఉంటాయని నిర్మోహమాటంగా చెబుతున్నారు. వ్యూహం(Vyooham) పేరుతో మొదటి పార్ట్‌ను ఈ నెలలోనే విడుదల చేయాలని వర్మ అనుకున్నారు. శపథం(Shapadam) పేరుతో రెండో పార్ట్‌ను ఎన్నికలకు ముందు విడుదల చేయబోతున్నారు.

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ(RGV) ప్రస్తుతం రెండు సినిమాలు తీస్తున్నారు. ఆ రెండు సినిమాలు ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి లబ్ధి చేకూర్చడానికే ఈ సినిమాలు రూపొందిస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రామ్‌గోపాల్ వర్మ కూడా ఇదే మాట అంటున్నారు. ఈ సినిమాలు కచ్చితంగా వైసీపీకి(YSRCP) అనుకూలంగా ఉంటాయని నిర్మోహమాటంగా చెబుతున్నారు. వ్యూహం(Vyooham) పేరుతో మొదటి పార్ట్‌ను ఈ నెలలోనే విడుదల చేయాలని వర్మ అనుకున్నారు. శపథం(Shapadam) పేరుతో రెండో పార్ట్‌ను ఎన్నికలకు ముందు విడుదల చేయబోతున్నారు. వ్యూహం సినిమాకు సెన్సార్‌బోర్డు కొన్ని అడ్డంకులు పెట్టింది. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన సెన్సార్‌ బోర్డు ఈ సినిమాను రివ్యూ కోసం సెంట్రల్‌బోర్డుకు పంపించింది. రివైజింగ్‌ కమిటీ సినిమాను చూసి ఏ విధమైన అభ్యంతరాలు చెప్పకుండా సర్టిఫికెట్‌ ఇచ్చింది. సెన్సార్‌ క్లియరెన్స్‌ రావడంతో వర్మ సినిమా రిలీజ్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిసెంబర్‌ 29వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు నారా లోకేశ్‌. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు(Censor Board) ఎలా సర్టిఫికెట్‌ ఇస్తుందంటూ కోర్టులో పిటిషన్‌ వేశారు. 27వ తేదీ వరకు సినిమాను ఆపడానికి కోర్డు నుంచి స్టే తెచ్చుకున్నారు లోకేశ్‌. ఇదే సమయంలో హైకోర్టులో(high Court) కూడా ఓ పిటిషన్‌ వేశారు లోకేశ్‌. అయితే హైకోర్టులో లోకేశ్‌ తరపు న్యాయవాదులు చేస్తున్న వాదన ఏమిటంటే ఈ సినిమాలో చంద్రబాబును, లోకేశ్‌ను కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిత్వ హననం చేశారని, కాబట్టి అటువంటి సన్నివేశాలను తొలగించాలని..!కోర్టులో వాదనలు ఇంకా జరుగుతున్నాయి. అసలు సినిమా విడుదల అవుతుందా లేదా అన్న ఉత్కంఠ మొదలయ్యింది. సడన్‌గా ఈ కేసులోకి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి(YS Jagan Mohan Reddy) సంబంధించిన కేసులను వాదించిన సీనియర్‌ అడ్వొకెట్‌ నిరంజన్‌ రెడ్డి(Niranjan Reddy) ఎంటరయ్యారు. నిరంజన్‌రెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు. ఈ కేసులో వర్మను గట్టెక్కించడం కోసం ఆయన కోర్టుకు వచ్చారు. కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. సెన్సార్‌బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చిన నేపథ్యంలో ఈ సినిమాను ఆపడం సరైంది కాదని నిరంజన్‌రెడ్డి అంటున్నారు. దీనిపై కోర్టులో గురువారం మళ్లీ వాదనలు జరుగుతాయి. 29న సినిమా విడుదలకు వర్మ ఏర్పాట్లు చేసుకున్నాడు. 28న కోర్టులో తనకు ఫేవర్‌గా తీర్పు రాకపోతే సినిమా(Cinema) విడుదలను వాయిదా వేసుకోక తప్పదు. లోకేశ్‌ తరపు న్యాయవాదులు చెబుతున్న మాటేమిటంటే సినిమా రిలీజ్‌ ఆలస్యమైనా పర్వాలేదు కానీ ఒక్కసారి విడుదలయ్యి ప్రజల ముందుకు సినిమా వెళ్లిన తర్వాత మా క్యారెక్టర్‌ అసాసినేషన్‌ జరిగితే వాటిని ఎలా సరిదిద్దుకోగలమని అడుగుతున్నారు. వర్మ(Varma) వ్యూహాన్ని నిరంజన్‌రెడ్డి గట్టెంచగలుగుతారా? వ్యూహం సినిమాను అనుకున్న తేదీకే విడుదల చేయించాలని ముఖ్యమంత్రి జగన్‌ కూడా అనుకుంటున్నారు కాబోలు! అందుకే తన లాయర్‌ నిరంజన్‌రెడ్డికి ఈ బాధ్యతను అప్పగించారు. చూదాం ఏం జరుగుతుందో...!

Updated On 27 Dec 2023 7:53 AM GMT
Ehatv

Ehatv

Next Story