జబర్థస్త్ ద్వారా చాలా మంది మారుమూలన దాగి ఉన్న టాలెంట్స్ ఎన్నో బయటకు వచ్చాయి. అలాంటి వారిలో కెవ్వు కార్తీక్ కూడా ఒకరు. సాధారణ కంటెస్టెంట్ గా జబర్ధస్ లోకి ఎంటర్ అయ్యి... టీమ్ లీడర్ గా ఎదిగాడు కార్తీక్. టీమ్ లీడర్ గా సక్సెస్ ఫుల్ స్కిట్స్ ఎన్నో ఇచ్చాడు. రీసెంట్ గా పెళ్లి చేసుకుని ఓఇంటివాడు కూడా అయ్యాడు కెవ్వు కార్తీక్. జబర్థస్త్ తో పాటు..

జబర్థస్త్(Jabardasth) టీమ్ లీడర్స్ లో కెవ్వు కార్తీక్ ఒకరు.. కంటెస్టెంట్ నుంచి టీమ్ లీడర్ గా ఎదిగిన అతను.. తాజాగా జబర్థస్త్ నుంచి మాయం అయ్యాడు. ఇంతకీ అతను ఎందుకు జబర్థస్త్ మానేశాడు.. బిగ్ బాస్ హౌస్(Bigg Boss) లోకి వెళ్తున్నాడా..? సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం ఎంత..?

జబర్థస్త్ ద్వారా చాలా మంది మారుమూలన దాగి ఉన్న టాలెంట్స్ ఎన్నో బయటకు వచ్చాయి. అలాంటి వారిలో కెవ్వు కార్తీక్ కూడా ఒకరు. సాధారణ కంటెస్టెంట్ గా జబర్ధస్ లోకి ఎంటర్ అయ్యి... టీమ్ లీడర్ గా ఎదిగాడు కార్తీక్. టీమ్ లీడర్ గా సక్సెస్ ఫుల్ స్కిట్స్ ఎన్నో ఇచ్చాడు. రీసెంట్ గా పెళ్లి చేసుకుని ఓఇంటివాడు కూడా అయ్యాడు కెవ్వు కార్తీక్. జబర్థస్త్ తో పాటు.. బయట ఈవెంట్స్ కూడా భారీగా చేస్తూ..చేతినిండా సంపాదిస్తున్నాడు. ఈక్రమంలోనే కెవ్వు కార్తీక్ జబర్థస్త్ ను వీడటం అందరికి ఆశ్చర్యన్ని కలిగించింది. మంచి ఫామ్ లో ఉండగా ఎందుకు ఈ ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చాడు అతని అంతా ఆలోచనలో పడ్డారు.

ఇక కెవ్వు కార్తీక్ బిగ్ బాస్ సీజన్ 7 లో సందడి చేయబోతున్నాడని అందుకే జబర్థస్త్ ను వదిలేశాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 త్వరలో రానుంది. ఇటీవలే ఓ రెండు ప్రోమోలు రిలీజ్ చేసి ఆడియన్స్ కి షోపై మరింత ఆసక్తి పెంచారు. బిగ్‌బాస్ సీజన్ 7 ప్రకటించడంతో ఈ షో అభిమానులు ఆసక్తిగా ఎప్పుడు మొదలవుతుందా, ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సారి కూడా నాగార్జుననే(Nagarjuna) హోస్ట్ చేయనున్నారు.

ఈక్రమంలో బిగ్ బాస్ లో పాల్గోనేవారు వీరే అంటూ.. ఓ పెద్ద లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీరియల్ నటులు, రియల్ లైఫ్ కపుల్ అమరదీప్ – తేజస్విని జంట, ఢీ పండు, జబర్దస్త్ అప్పారావు, ఆట సందీప్, యూట్యూబర్ శ్వేతా నాయుడు, యూట్యూబర్ నిఖిల్, ఓ యూట్యూబ్ మేల్ యాంకర్, యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల, హీరోయిన్ ఎస్తర్ నోరాన్హా, యాంకర్ శశి, సురేఖ వాణి, సుప్రీతా.. ఇలా మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా బిగ్‌బాస్ లోకి జబర్దస్త్ కెవ్వు కార్తీక్ వెళ్తాడని వినిపిస్తుంది.

మిమిక్రితో కెరీర్ స్టార్ట్ చేసి జబర్దస్త్ తో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు కెవ్వు కార్తీక్. ప్రస్తుతం కమెడియన్ గా పలు సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తున్నాడు. కెవ్వు కార్తీక్ చాలా మాములు ఫ్యామిలీ నుంచి వచ్చి కష్టపడి పైకి ఎదిగాడు. ఇటీవలే వివాహం కూడా చేసుకున్నాడు. అయితే ఇప్పుడు కెవ్వు కార్తీక్ బిగ్‌బాస్ లోకి వెళ్తాడని టాక్ వినిపిస్తుంది. గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి కెవ్వు కార్తీక్ జబర్దస్త్ లో కనపడట్లేదు. అలాగే కెవ్వు కార్తీక్(Kevvu Kartheek) కి బిగ్‌బాస్ నుంచి ఆఫర్ వచ్చినట్టు, దానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అందుకే జబర్దస్త్ మానేశాడని సమాచారం.

Updated On 14 Aug 2023 2:52 AM GMT
Ehatv

Ehatv

Next Story