ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో యాక్టర్ రీతూ చౌదరి పేరు మార్మోగిపోతుంది. రీతు చౌదరి తాజాగా ఓ స్కాంలో ఇరుకున్నారు.
ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో యాక్టర్ రీతూ చౌదరి పేరు మార్మోగిపోతుంది. రీతు చౌదరి తాజాగా ఓ స్కాంలో ఇరుకున్నారు. ఏకంగా రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాం లో ఆమె అడ్డంగా బుక్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.ఏపీకు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతూ చౌదరికి పేరు బయటకు వచ్చిందనే టాక్ వినిపిస్తుంది. జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో నటి రీతూ చౌదరి, ఆమె మాజీ భర్త చీమకుర్తి శ్రీకాంత్‌పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శ్రీకాంత్‌కు రీతు చౌదరి రెండో భార్య అని తెలుస్తోంది. రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంపై శ్రీకాంత్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు. ఇదే సమయంలో రీతూ చౌదరి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా నాకు చెందినవే అని చీమకుర్తి శ్రీకాంత్ తెలిపారు. మేము సంపాదించుకున్నవి అని అన్నారు. అలాగే నేను ఎవరికీ బినామీని కాదు. నాపై వస్తోన్న ఆరోపణలు అన్ని అవాస్తవమని ఆయన శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. తాజాగా ఈ స్కాంపై రీతూ చౌదరి స్పందించారు.
ప్రముఖ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె ల్యాండ్ స్కాంపై కీలక విషయాలను వెల్లడించారు. నాకు శ్రీకాంత్‌కు ఎలాంటి సంబంధం లేదని రీతూ చౌదరి తెలిపారు. ఏడాది క్రితమే అతనితో విడిపోయాననని రీతూ చౌదరి చెప్పుకొచ్చింది. గతంలో తాము కలిసి ఉన్న సమయంలో సంతకం పెట్టమంటే పెట్టానని రీతూ చౌదరి తెలిపింది. శ్రీకాంత్‌తో తాను గోవా పార్టీకి వెళ్లలేదని రీతూ చౌదరి క్లారిటీ ఇచ్చింది.ఆయనతో సినిమా ఆర్టిస్టులు చాలామంది కాంటాక్ట్‌లో ఉన్నారని ,అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించడానికి రీతూ ఇష్టపడలేదు.
ఈ స్కాంలో నాకేమి సంబంధం లేదని ,తాను అమాయకురాలినని ఆమె పేర్కొన్నారు.రూ. 700 కోట్లకు తనకు సంంబంధం లేదని, కేవలం తన అకౌంట్‌లో జమ అయిన రూ. 4 కోట్ల గురించే మాత్రమే ఈ కేసులో నా ప్రస్తావన వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. శ్రీకాంత్ సంతకాలు చేయమంటే చేశానని రీతూ చౌదరి వెల్లడించింది. నా అకౌంట్స్‌ను ఏసీబీ సీజ్ చేసినట్టు రీతూ చౌదరి చెప్పారు. తాను ఏసీబీ విచారణకు హాజరయ్యానని ఆమె తెలిపింది. తాము పెళ్లి చేసుకున్న మాట వాస్తవమేనని, కానీ పెళ్లైనా కొద్ది రోజులకే ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చినట్టు రీతూ వెల్లడించింది. శ్రీకాంత్‌తో విడాకులు తీసుకుని ఏడాదిపైగానే అవుతుందని రీతూ చౌదరి పేర్కొంది. ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పినట్టు రీతూ చౌదరి తెలిపింది.