బుల్లితెర తారలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. లైఫ్ లో సెటిల్ అయ్యాక మాత్రమే పెళ్లిళ్లు చేసుకోవాలి అనుకున్న తారులు.. ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకుంటున్నారు. ఎంతో మంది టాలెంట్ ఉన్న వ్యక్తులకు లైఫ్ ఇచ్చింది జబర్థస్త్. సామాన్యుల ప్రతిభను గుర్తించి సెలబ్రిటీలను చేసింది. ఈక్రమంలో జబర్థస్త్ ద్వారా గుర్తింపు పొందిన కామెడియన్లలో కెవ్వు కార్తీక్ కూడా ఒకరు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి..

బుల్లితెర తారలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. లైఫ్ లో సెటిల్ అయ్యాక మాత్రమే పెళ్లిళ్లు చేసుకోవాలి అనుకున్న తారులు.. ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకుంటున్నారు.

ఎంతో మంది టాలెంట్ ఉన్న వ్యక్తులకు లైఫ్ ఇచ్చింది జబర్థస్త్. సామాన్యుల ప్రతిభను గుర్తించి సెలబ్రిటీలను చేసింది. ఈక్రమంలో జబర్థస్త్ ద్వారా గుర్తింపు పొందిన కామెడియన్లలో కెవ్వు కార్తీక్ కూడా ఒకరు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. జబర్థస్త్ కంటెస్టెంట్ గా మారి.. ఆతరువాత సోలో గ్రూప్ లీడర్ గా గుర్తింపు పొందాడు కార్తీక్. ముక్కు అవినాష్ తో కలిసి జాయిట్ గా టీమ్ లీడ్ చేసిన కార్తీక్ కు .. అవినాష్ టీమ్ జబర్థస్త్ నుంచి వెళ్లిపోవడం కలిసి వచ్చింది. సోలో లీడర్ గా సత్తా చాటాడు కార్తీక్.

ఇక కెవ్వు కార్తీక్ రీసెంట్ గా ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు స్వయంగా ప్రకటించాడు. అమ్మాయితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కార్తీక్.. అమ్మాయి ఫోటో కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. పెళ్లి కూతురు ముఖం కనిపించకుండా కవర్ చేస్తూ.. ఫోటో షూట్ చేశారు. పేరు కూడా చెప్పలేదు. త్వరలో వివరాలు వెల్లడిస్తాను అన్నారు కెవ్వు కార్తీక్. ప్రస్తుతం ఈ పోస్ట్ తో పాటు.. కార్తీక్ పెళ్ళి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చాడు కార్తీక్. మ‌న జీవితంలోకి ఓ కొత్త వ్య‌క్తి వ‌స్తే చాలా సంతోషంగా ఉంటుంద‌ని కొంత మంది చెబుతుంటారు. బ‌హుశా అది ఇదే కావచ్చు. నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్యూ బ్యూటీఫుల్. నీతో కొత్త జీవితాన్ని వీలైనంత తొంద‌ర‌గా మొద‌లుపెట్టాల‌ని ఎంతగానో ఎద‌రుచూస్తున్నా. అంటూ రెండు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు కార్తీక్.

ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లతోపాటు.. బుల్లితెర సెలబ్రిటీస్ కూడా కార్తీక్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదిరే అభి, ప్రియాంక సింగ్‌, జోర్దార్ సుజాత, గెటప్ శ్రీను, అభిన‌వ్ త‌దిత‌రులు కార్తీక్ కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

Updated On 2 Jun 2023 5:14 AM GMT
Ehatv

Ehatv

Next Story