తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు హైపర్‌ ఆది(Hyper Adhi). టెలివిజన్‌లలో ప్రసారం అవుతున్న కామెడీ షోలకు స్క్రిప్ట్‌ రైటర్‌గా ఎంట్రీ ఇచ్చిన హైపర్‌ ఆది తర్వాతతర్వాతఅదే షోలో టీమ్‌లీడర్‌ అయ్యారు. తిరుగులేని పంచులతో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. తద్వారా వచ్చిన పాపులారిటీతో చాలా షోలు చేస్తున్నాడు. ఇప్పుడు తీరిక లేకుండా ఉన్నారు. తనకంటూ ఫ్యాన్స్‌ను ఏర్పరచుకున్నాడు.

తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు హైపర్‌ ఆది(Hyper Adhi). టెలివిజన్‌లలో ప్రసారం అవుతున్న కామెడీ షోలకు స్క్రిప్ట్‌ రైటర్‌గా ఎంట్రీ ఇచ్చిన హైపర్‌ ఆది తర్వాతతర్వాతఅదే షోలో టీమ్‌లీడర్‌ అయ్యారు. తిరుగులేని పంచులతో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. తద్వారా వచ్చిన పాపులారిటీతో చాలా షోలు చేస్తున్నాడు. ఇప్పుడు తీరిక లేకుండా ఉన్నారు. తనకంటూ ఫ్యాన్స్‌ను ఏర్పరచుకున్నాడు. అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తున్నాడు హైపర్‌ ఆది. ఈ మధ్య విడుదలైన ధనుష్‌(Danush) సినిమా సార్‌లో(sir) కూడా ఆది కనిపించాడు. ఇప్పుడు ఆయనకు పెళ్లి మీద మనసుపోయిందట! పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కావాలని అనుకుంటున్నాడట! ప్రముఖ యూట్యూబ్‌ యాంకర్‌తో(anchor) ఆది ప్రేమలో ఉన్నాడట! ఆమెతో ఆదికి చాలా కాలం నుంచి పరిచయం ఉందట! ఓ రకంగా ఆది ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సమయంలో అతడికి ఆమె ఎంతో సాయంగా నిలిచిందట! అలా ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి ప్రేమగా రూపాంతరం చెందిందట! వీరి ప్రేమ గురించి ఇద్దరి ఇంట్లో తెలిసిపోయిందని సమాచారం. పెద్దలు కూడా పెళ్లికి అంగీకరించారట! త్వరలోనే ఓ మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట! త్వరలో ఆ అమ్మాయి పేరుతో పాటు పెళ్లి విషయాన్ని ఆది అధికారికంగా వెల్లడి చేయబోతున్నారట!

Updated On 31 July 2023 7:28 AM GMT
Ehatv

Ehatv

Next Story