జబర్దస్త్ ఖత్తర్నాక్ కామెడీ షోతో బాగా పాపులర్ అయ్యింది కమెడియన్ రోహిణి (Rohini). ఇండస్ట్రీలో లేడీ కమెడియన్స్ చాలా తక్కువ. వారిలో ఇప్పటి జనరేషన్ లో అసలే కనిపించడంలేదు లేడీ కామెడీ స్టార్స్. ఈక్రమంలోనే.. రౌడీ రోహిణి.. బుల్లితెరపై పాపులార్ కమెడియన్ గా పేరు తెచ్చుకుంది. అంతకు ముందు నుంచే ఆమె కామెడీ పాత్రలు చేస్తుండగా.. ఆతరువాత జబర్థస్త్ లోకి టీమ్ మెంబర్ గా ఎంట్రీ ఇచ్చి.. టీమ్ లీడర్ స్థాయికి ఎదిగింది. తన కామెడీ టైమింగ్స్‌తో.. నాటు పంచులతో.. చాలా మందికి ఫెవరేట్ కమెడియన్ గా మారింది.

ఇక ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో కూడా బిజీగా మారింది రోహిణి. తాజాగా రోహిణీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్తెలిసింది. ఇప్పుడు ఆస్పత్రి పాలైంది. ఆమె కాలికి సర్జరీ జరగడంతో లేవలేని స్థితిలో హాస్పిటల్‌లోనే విశ్రాంతి తీసుకుంటుంది. తనకు సర్జరీ జరిగిన విషయాన్ని రౌడీ రోహిణీయే స్వయంగా.. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించింది. ఈవిషయం తెలిసి ఆమె అభిమానులు కంగారుపడుతున్నారు. ఇంతకీ అసలు ఏమయ్యిందంటే..?
దాదాపు ఐదేళ్ళ కిందట రోహిణీకి ఓ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు కాలికి ఫాక్చర్ అయ్యి.. రోహిణి కాలిలో ఓ రాడ్ వేశారు. అయితే ఈ రాడ్ ను ఎప్పట్నుంచో తీసేయించాలని రోహిణి అనుకున్నప్పటికీ.. అప్పుడే కెరీర్‌లో బిజీగా మారడంతో కుదర్లేదు. ఇన్నేళ్లకు కాస్త ఖాళీ టైమ్ దొరకడంతో ఆస్పత్రికి వెళ్లి రాడ్ తీసేయించుకోవాలి అనుకుంది. అయితే హాస్పిటల్ కు వెళ్లిన రోహిణికి డాక్టర్లు పెద్ద షాక్ ఇచ్చారు. రోహిణి కాలిని పరీక్షించిన వైద్యులు చాలా కాలం కావడంతో రాడ్ స్కిన్‌కు అతుక్కుపోయిందని.. ఒకవేళ ఫోర్స్ పెట్టి తీస్తే మల్టీపుల్ ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు గుర్తించారు. దీంతో కాలిలో నుంచి రాడ్ తీయడం సాధ్యపడలేదు.
అయితే రోహిణి కాలికి మాత్రం మైనర్ సర్జరీ ఒకటి చేశారు. ఇక ఈ విషయాన్ని రోహిణీ తన సోషల్ మీడియా పేజ్ లో పంచుకున్నారు.
ఇంటి నుంచి హాస్పిటల్ కు వెళ్ళడం.. అక్కడ డాక్టర్లు పరీక్షలు చేయడం.. ఆపరేషన్.. కదల్లేని పరిస్థితుల్లోకి వెళ్లడం.. ఇలా అన్ని విషయాలు వీడియో రికార్డ్ చేయించి పోస్ట్ చేసింది రోహిణి. ఇక ఐదేల్ల నుంచి ఈ రాడ్ వల్ల నరకం చూస్తున్నానని.. తీసేయించుదాం అనుకుంటే.. ఇలా జరిగిందని బాధపడుతుంది రోహీణి.