ఎంతో మంది సామాన్యులను సెలబ్రిటీలను చేసిందిజబర్థస్త్ కామెడీ షో.. ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడే ముక్కు అవినాష్(Mukku Avinash). కమెడియన్(Comedian) గా బుల్లితెరపై, వెండితెరపై సందడిచేస్తున్న ఈ స్టార్ కమెడియన్.. తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పాడు.

ఎంతో మంది సామాన్యులను సెలబ్రిటీలను చేసిందిజబర్థస్త్ కామెడీ షో.. ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడే ముక్కు అవినాష్(Mukku Avinash). కమెడియన్(Comedian) గా బుల్లితెరపై, వెండితెరపై సందడిచేస్తున్న ఈ స్టార్ కమెడియన్.. తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పాడు.

జబర్ధస్త్ కామెడీ షో(Jabardast)ద్వారా తెరకు పరిచయం అయిన అవినాశ్(Avinash).. జబర్థస్త్ ద్వారా ముక్కు అవినాష్ గా పేరు తెచ్చుకున్నాడు. తన కామెడీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకన్నాడు అవినాశ్. ప్రస్తుతం జబర్థస్త్ వల్ల వచ్చిన ఇమేజ్ తోనే.. ఇటు బుల్లితెరపై.. అటు వెండితెరపై సందడి చేస్తూ.. స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ఇక ఈ స్టార్ యాక్టర్ తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పాడు.

ముక్కు అవినాష్ కిందస్థాయి నుంచి.. ఒక్కో మెట్టు ఎక్కుతూ... ఎదిగాడు. అంతే కాదు సొంతిల్లు కట్టుకోవడంతో పాటు ఓఇంటివాడు కూడా అయ్యాడు. 2021 లో అనుజ ను పెళ్లి చేసుకొని భార్యతో సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు. ఈ జంట పలు రియాల్టీ షోల్లో(reality show) పాల్గొన్నారు. జబర్ధస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్(Bigg Boss) రియాలిటీ షోలోకి అడుగు పెట్టి మరింత ఫేమస్ అయ్యాడు. తాజాగా ముక్కు అవినాష్ తాజాగా ఓ శుభవార్త చెప్పాడు.

త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నామని.. ఇద్దరం ముగ్గురం కాబోతున్నాం అంటూ యూట్యూబ్ వేదికగా అవినాష్ తెలిపాడు. ‘నా భార్య అనూజ ప్రస్తుతం ప్రెగ్నెంట్(Pregnant).. త్వరలోనే మా ఇంట్లోకి పాపాయి లేదా బాబు రాబోతున్నారు.. మా పెళ్లై ఏడాదిన్నర అవుతుంది.. అక్టోబర్ మాసంలో మా పెళ్లి జరిగింది. పిల్లల్ని ఎప్పుడు కంటారు అని మా పేరెంట్స్, బంధువులు మమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పాం..

పెళ్లైన ఏడాదిన్నరకే మేం తల్లిదండ్రులు కాబోతున్నాం.. మూడు నెలల వరకు డాక్టర్ ఎవరికీ చెప్పొదని అన్నారు.. ప్రస్తుతం తనకు నాలుగో నెల.. అందుకే ఈ సంతోషకరమైన వార్త బయటకు చెబుతున్నాం.. నాలుగో నెలలో బేబీ గుండె చప్పుడు విన్నాం.. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం.. మా పేరెంట్స్, తన పేరెంట్స్ ఎంతో హ్యాపీగా ఉన్నారు అని ఎంతో సంతోషంగా అనౌన్స్ చేశాడు ముక్కు అవినాష్.

Updated On 9 July 2023 12:45 AM GMT
Ehatv

Ehatv

Next Story