రష్మీ(Rashmi) తెలుగులో పాపులర్‌ యాంకర్‌లో(Anchor) ఒకరు. రష్మీ కోసమే షోలు చూసే ప్రేక్షకులు కూడా ఉన్నారు. రష్మీ పేరు చెప్పగానే చాలా మందికి అప్రయత్నంగానే సుడిగాలి సుధీర్‌(Sudigali sudheer) పేరు గుర్తుకొస్తుంది. వీరిద్దరు కలిసి జబర్దస్త్‌(Jabardasth) షోలో ప్రేక్షకులను ఎంతగా అలరించారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. వీరిద్దరు ఏ క్షణాన కలిశారో కానీ జంటగా హాట్‌ టాపిక్‌ అయిపోయారు.

రష్మీ(Rashmi) తెలుగులో పాపులర్‌ యాంకర్‌లో(Anchor) ఒకరు. రష్మీ కోసమే షోలు చూసే ప్రేక్షకులు కూడా ఉన్నారు. రష్మీ పేరు చెప్పగానే చాలా మందికి అప్రయత్నంగానే సుడిగాలి సుధీర్‌(Sudigali sudheer) పేరు గుర్తుకొస్తుంది. వీరిద్దరు కలిసి జబర్దస్త్‌(Jabardasth) షోలో ప్రేక్షకులను ఎంతగా అలరించారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. వీరిద్దరు ఏ క్షణాన కలిశారో కానీ జంటగా హాట్‌ టాపిక్‌ అయిపోయారు. సుమారు ఆరేడునేళ్ల నుంచి టీవీ స్క్రీన్‌పై వీరిద్దరి జంటను అధిగమించే కాంబినేషన్‌ ఇప్పటి వరకు రాలేదు. అలాంటిది వీరిద్దరు కలసి చాలా రోజులుగా టీవీలలో కనిపించడం లేదు. ప్రేక్షకులు మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నారు. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ప్రేక్షకులకు తెలియదు. ఫ్యాన్స్‌ అయితే తెగ వర్రీ అవుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు ముగింపు పలకడానికే అన్నట్టుగా రష్మీ తన బ్రేకప్స్‌ గురించి మాట్లాడారు.

జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకరింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం వీటితో ఆమె చాలా బిజీగా ఉన్నారు. ఈ షోలతో పాటుగా అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ మధ్యనే మెగాస్టార్‌ చిరంజీవితో(Chiranjeevi) కలిసి భోళాశంకర్‌లో(Bholashankar) సినిమాలో నటించారు. చిరుతో కలిసి ఓ పాటలో స్టెప్పులు కూడా వేశారు. తాజాగా కన్నడలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన బాయ్స్‌ హాస్టల్‌లో(Boys Hostel) ఓ గెస్ట్‌ రోల్‌ చేశారు. ఈ సినిమాతో తెలుగులో కూడా ఆగస్టు 25వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రీలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇందులో రష్మీ మాట్లాడుతూ పలు ఆసక్తకరమైన వ్యాఖ్యలు చేశారు. హార్ట్‌ బ్రేక్స్‌ గురించి చెప్పారు. 'ప్రతి ఒక్కరి జీవితంలో హార్ట్‌ బ్రేక్‌, రిలేషన్స్‌ చాలా ఉంటాయి. 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు చాలా మంది ఇవన్నీ చూస్తూనే ఉంటారు. నా బ్రేకప్స్‌ గురించి కౌంట్‌ చేసి చెప్పడం చాలా కష్టం' అని చెప్పారు. రష్మీ చేసిన కామెంట్స్‌ చూస్తుంటే ఆమె మనసు కూడా ఇప్పటికే చాలాసార్లు బద్దలయ్యిందన్నమాట!

Updated On 21 Aug 2023 12:57 AM GMT
Ehatv

Ehatv

Next Story