బెడ్‌రూం వరకే మగాడు అవసరం.. టబూ సంచలన వ్యాఖ్యలు

టబూ (Tabu) హైదరాబాదులో పుట్టి ముంబైలో స్థరపడిన సినిమా నటి. ఈమె నటి ఫరాహ్ చెల్లెలు. నటి దివ్యభారతి స్నేహితురాలు. దివ్యభారతి ద్వారా దర్శకుడు రాఘవేంద్రరావుకు పరిచయం కావడంతో కూలీ నెంబర్ వన్ చిత్రంతో తెలుగుతెరపై తెరంగేట్రం చేసింది. అసలు పేరు తబుస్సుమ్ హష్మి. 1971 నవంబరు 4న హైదరాబాదీ‌ ముస్లిం కుటుంబంలో జన్మించింది. తండ్రి జమాల్ అలీ హష్మి, తల్లి రిజ్వానా. ఆమె తల్లి అధ్యాపకురాలిగా పనిచేసింది. బాల్యంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. అధ్యాపకులైన అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగింది. హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్‌లో (St.Aans) చదువుకుంది. ప్రముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీలకి టబూ స్వయానా మేనకోడలు. వాళ్లను స్ఫూర్తిగా తీసుకొని 1983లో హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లింది. నిన్నటితరానికి చెందిన ప్రముఖ కథానాయిక ఫరానాజ్ కూడా టబూకి బంధువు అవుతారు.

1980లోనే కెమెరా ముందుకెళ్లింది. 'బజార్' (Bazar) అనే చిత్రంలో బాలనటిగా ఓ చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత ఐదేళ్లకు 'హమ్ నే జవాన్' లో దేవానంద్‌కి కూతురిగా నటించింది. పద్నాలుగేళ్ల వయసులో చేసిన ఆ పాత్ర ద్వారా టబూ బాలీవుడ్ ఇండస్ట్రీని ఆకట్టుకుంది. బోణీకపూర్ తన సంస్థలో నిర్మించనున్న 'రూప్‌కీ రాణీ చోరోంకా రాజా', 'ప్రేమ్' చిత్రాల కోసం టబుని కథానాయికగా ఎంపిక చేసుకొన్నాడు. 'ప్రేమ్'లో సంజయ్‌కపూర్ సరసన నటించింది టబూ. అయితే ఆ చిత్రం పూర్తి కావడానికి సుమారు ఎనిమిదేళ్లు పట్టింది. సుదీర్ఘకాలం తర్వాత విడుదలైనా, ఆ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో టబూకి ఇక మాత్రం కలిసిరాలేదు.

'కూలీ నెంబర్ 1' (Kooli no.1) చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. 1991లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం చక్కటి ఆదరణ పొందింది. వెంకటేష్ సరసన నటించిన టబూ గురించి తెలుగు ప్రేక్షకులంతా ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అంతలోనే హిందీ చిత్రాలతో మరింత బిజీ అయిపోయింది. 'విజయ్‌పథ్'లో అజయ్ దేవగణ్ సరసన నటించి తొలి విజయాన్నందుకొంది. ఇక ఆ చిత్రం తర్వాత మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. 'సాజన్ చలే ససురాల్', 'జీత్' చిత్రాలు ఆమెని స్టార్ కథానాయికని చేశాయి. 90వ దశకమంతా బాగా కలిసొచ్చింది. అటు గ్లామర్ పాత్రలతోనూ, ఇటు నటనకు ప్రాధాన్యమున్న కథల్లోనూ నటించింది. హిందీలో చేసిన 'మాచీస్' చిత్రం టబుకి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. పంజాబీ మహిళ పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఆ వెంటనే ప్రియదర్శన్ దర్శకత్వంలో కాలాపానీ చేసింది. అది కూడా గుర్తింపును తీసుకురావడంతోపాటు తమిళంలో అవకాశాల్ని తెచ్చిపెట్టింది.

కథానాయికగా టబూ తెలుగుపై చెరగని ముద్ర వేసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా, టబూ అనగానే తెలుగు ప్రేక్షకులు 'మా కథానాయికే' అంటుంటారు. 'కూలీ నెంబర్ 1' తర్వాత చాలా రోజులకి 'నిన్నే పెళ్లాడతా'లో నటించింది. సినిమాలో నాగార్జునతో టబు కెమిస్ట్రీ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత 'ఆవిడా మా ఆవిడే', 'అందరివాడు', 'పాండురంగడు', 'చెన్నకేశవరెడ్డి, 'ఇదీ సంగతి' తదితర చిత్రాల్లో నటించి అలరించింది. ఆమె తమిళంలో నటించిన 'కాదల్ దేశమ్' తెలుగులో 'ప్రేమదేశం'గా విడుదలై ఘనవిజయం అందుకొంది.

నటుడు నాగార్జునకు ఈమె అతి సన్నిహితంగా వ్యవహరించిందని చర్చించుకుంటారు. నాగార్జున కోసమే ఆమె పెళ్లి చేసుకోలేదని ఇండస్ట్రీలో టాక్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివాహం గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తనకు పెళ్లితో అవసరం ఏముందని టబూ ఎదురు ప్రశ్నించారు. మొగుడు తోడు లేకుండా బాగానే ఉన్నానని చెప్పారు. మగాడి అవసరం పడక గదిలోలోనే ఉంటుంది కానీ జీవితంలో కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కొందరు పాజిటివ్ రెస్సాన్స్ ఇస్తే కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. 53 ఏళ్ల టబూ ఇప్పటికీ తన అందంతో మగాళ్లు హృదయాలను కొల్లగొట్టిస్తోంది. ఇప్పటికీ తరగని అందంతో కవ్విస్తూ ఉంటుంది.

Updated On 18 Jan 2025 5:56 AM GMT
ehatv

ehatv

Next Story