జూబ్లీహిల్స్‌లోని తెలుగు సినీ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Mythri Movie Makers -Pvt ltd) ఆఫీసుపై కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు దాడులు చేసినట్టు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ దాడులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ దాడులు చేస్తోందని కొన్ని వర్గాలు చెప్తున్నాయి. అయితే ఐటీ అధికారులు మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ పై దాడులు చేస్తున్నారని మరికొంత మంది అంటున్నారు.

mythri movie makers
జూబ్లీహిల్స్‌లోని తెలుగు సినీ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Mythri Movie Makers -Pvt ltd) ఆఫీసుపై కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు దాడులు చేసినట్టు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ దాడులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ దాడులు చేస్తోందని కొన్ని వర్గాలు చెప్తున్నాయి. అయితే ఐటీ అధికారులు మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్‌పై దాడులు చేస్తున్నారని మరికొంత మంది అంటున్నారు.సూపర్ హిట్ మూవీ 'పుష్ప' చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో ఉన్న డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇక జూబ్లీహిల్స్‌లోని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ప్రమోటర్స్తోపాటు యెర్నేని నవీన్(Naveen Yerneni), యలమంచిలి రవిశంకర్(Yalamanchili Ravi Shankar) ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హవాలా మార్గంలో నిధుల మళ్లింపు ద్వారా ప్రమోటర్లు మనీలాండరింగ్ పాల్పడినట్టు ఈడీకి సమాచారం అందినట్టు తెలుస్తోంది. అయితే ప్రమోటర్లకు విదేశాల్లోని ఎన్ఆర్ఐలతో వ్యాపార లింకులు ఉన్నాయంటున్నారు. అయితే గత డిసెంబర్లో మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో ఇన్ కమ్‌ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జీఎస్టీ నిబంధనలను ఉల్లంఘించారని, ఐటీ రిటర్స్న్లో తప్పుడు వివరాలు సమర్పించారని ఆరోపించింది ఐటీ శాఖ.
