నిఖిల్(Nikhil )హీరోగా వస్తున్న స్పై(Spy) సినిమాలో ఐశ్వర్యా మీనన్(Iswarya Menon) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ నెల 29న విడుదల అవుతున్న ఈ సినిమాకు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా ఐశ్వర్యా మీనన్ మీడియాతో కెరీక్‌కు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. పనిలో పనిగా తన వ్యక్తిగత విషయాలను కూడా చెప్పారు. ఓ నటిగా తన కెరీర్ పట్ల సంతృప్తిగానే ఉన్నానని అన్నారు.
నిఖిల్(Nikhil )హీరోగా వస్తున్న స్పై(Spy) సినిమాలో ఐశ్వర్యా మీనన్(Iswarya Menon) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ నెల 29న విడుదల అవుతున్న ఈ సినిమాకు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా ఐశ్వర్యా మీనన్ మీడియాతో కెరీక్‌కు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. పనిలో పనిగా తన వ్యక్తిగత విషయాలను కూడా చెప్పారు. ఓ నటిగా తన కెరీర్ పట్ల సంతృప్తిగానే ఉన్నానని అన్నారు. అసలు తాను హీరోయిన్ అవుతానని ఊహించలేదన్నారు. 'నేను ఇంజనీర్‌ను. నా బ్రదర్ డాక్టర్. మొదట్లో కొన్ని యాడ్స్ ఫిలింస్‌లో నటించాను. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక్కో అడుగు వేసుకుంటూ ఇప్పుడు హీరోయిన్‌గా రాణిస్తున్నాను. ఈ ప్రయాణం నాకు హ్యాపీగా ఉంది' అని ఐశ్వర్యా మీనన్ తెలిపారు. తెలుగులో హీరోయిన్‌గా తాను చేసిన తొలి చిత్రం స్పై అని, ఈ సినిమాలో తన క్యారెక్టర్‌లో చాలా షేడ్స్ ఉన్నాయని అన్నారు. తాను ఈ సినిమాలో రా ఏజెంట్‌గా కనిపిస్తానని, ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని తెలిపారు. గన్‌ను సరిగ్గా పట్టుకోవడం, షూటింగ్.. ఇలా కొత్త విషయాలు నేర్చుకున్నానని, ప్రేమకథలే కాదు.. యాక్షన్ సన్నివేశాల్లో కూడా తాను బాగా నటించగలననే విషయం తనకు ‘స్పై’తో తెలిసొచ్చిందని అన్నారు. యాక్షన్ సినిమాలు కూడా చేయగలననే కాన్ఫిడెన్స్ పెరిగిందని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత రహస్యాల ఆధారంగా అనేది ఈ సినిమా బేస్‌లైన్ మాత్రమేనని, డ్రామా వేరుగా ఉంటుందని ఐశ్వర్యా మీనన్ పేర్కొన్నారు. 'గ్యారీగారు ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు నన్నే అనుకున్నారట. దీంతో ఆయన స్ట్రయిట్‌గా వచ్చి నాకు కథ చెప్పారు. నేను చూసిన తొలి తెలుగు సినిమా హ్యాపీ డేస్. అలాగే నిఖిల్ చేసిన స్వామి రారా, కార్తికేయ సినిమాలు కూడా చూశాను. ఆయన ప్రతి సినిమాను ఫాలో అవుతుంటాను. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో కార్తికేయ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్నాను’ అని అన్నారు ఐశ్వర్యా మీనన్.