✕
Isha Talwar : పర్పుల్ కలర్ డ్రెస్సులో అదరగొట్టిన ఈషా తల్వార్.. పర్పుల్ బ్యూటీ అంటున్న ఫ్యాన్స్.. !
By EhatvPublished on 1 Jun 2023 1:09 AM GMT
ఈషా తల్వార్ (Isha Talwar) ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కాస్త తక్కువే పరిచయం.. ఈ భామ తెలుగులో చేసింది రెండు సినిమాలే. ఓటీటీ ప్రియులకు మాత్రం ఈ బ్యూటీ సుపరిచితమే. 2020లో వచ్చిన మీర్జాపూర్ (Mirzapur) వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రియులకు బాగా పరిచయమైంది ఈ భామ.

x
Isha Talwar
-
- ఈషా తల్వార్ (Isha Talwar) ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కాస్త తక్కువే పరిచయం.. ఈ భామ తెలుగులో చేసింది రెండు సినిమాలే. ఓటీటీ ప్రియులకు మాత్రం ఈ బ్యూటీ సుపరిచితమే. 2020లో వచ్చిన మీర్జాపూర్ (Mirzapur) వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రియులకు బాగా పరిచయమైంది ఈ భామ.
-
- ఈషా తల్వార్ గుండెజారి గల్లంతయిందే (Gunde Jaari Gallanthayyinde) చిత్రంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ ఒక్క సినిమా తర్వాత మళ్లీ తెలుగు వైపు చూడకుండా తమిళం, మలయాళం సినిమాలు చేసుకుంటూపోయింది. మూడేళ్ల గ్యాప్ తర్వాత రాజా చెయ్యివేస్తే చిత్రంతో మళ్లీ తెలుగువాళ్లను పలకరించింది.
-
- ఆ చిత్రం బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. ఇక దాంతో టాలీవుడ్ వైపు కన్నెత్తికూడా చూడలేదు ఈ బ్యూటీ. తమిళం, మలయాళం, హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజిబిజిగా గడుపుతోంది శ్రుతి.
-
- ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసి ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. తాజాగా ఈ బ్యూటీ వంకాయ్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలు షేర్ చేసింది ఈషా. పర్పుల్ కలర్ డ్రెస్‌కి తోడు మెడలో రెండు చైన్ లు వేసుకుని.. చెవులకు సేమ్ కలర్ రింగ్స్ ధరించి.. జుట్టును వెనక్కి లాకి కట్టి స్టన్నింగ్ లుక్స్ ఇచ్చింది.
-
- ఈ ఫొటోలకు ‘చాట్ జీపీటీ’ అయామ్ పర్పుల్ ఇనాఫ్.. డోంట్ నీట్ యువర్ క్యాప్షన్స్ అంటూ రాసుకొచ్చింది. ఫొటోలు పెట్టిన కాసేపట్లోనే కామెంట్ సెక్షన్ బాక్సులోకి దూసుకొచ్చారు ఫ్యాన్స్. ఈ పిక్స్‌కి హైఫై, ఫైర్, రెడ్ హార్ట్ ఎమోజీలను జోడించి మెసెజ్ చేస్తున్నారు ఈషా తల్వార్ అభిమానులు.
-
- ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాల కంటే సిరిస్లపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ప్రెజెంట్ ఈ భామ సాస్, బహు ఔర్ ఫ్లెమింగో (Saas, Bahu Aur Flamingo), ఇండియన్ పోలీస్ ఫోర్స్ (Indian Police Force) అనే రెండు సిరీస్‌లు చేసింది. ఈ భామకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story