ఇంతకీ కల్కి ఎవరు? ప్రభాస్ కాదా?
డార్లింగ్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న కల్కి 2898 ఏడీ(Kalki AD 2898) సినిమా నుంచి మరో ట్రైలర్ వచ్చింది. మొదటిదానితో పోలిస్తే రెండో ట్రైలర్‌లో విస్మయం కలిగించే విజువల్స్‌తో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంది. ఈ ట్రైలర్‌ను చూస్తే కథ ఏమిటో చూచాయిగా తెలుస్తున్నది. కాంప్లెక్స్, కాశీ, శంభలా అనే మూడు ప్రపంచాలు.. వాటిలో మనుషుల మధ్య యుద్ధమే ప్రధాన ధీమ్ అని తెలుస్తోంది. అన్ని బాగానే ఉన్న ఓ పాయింట్ మాత్రం ఆసక్తిని కలిగిస్తున్నది. కల్కి సినిమా రెండు ట్రైలర్స్ చూస్తే సినిమాలోని చాలా పాత్రలు మనకు పరిచయం అయ్యాయి. ఇవే కాదు సినిమాలో ఇంకా చాలా పాత్రలు ఉన్నాయి. సినిమా విడుదలైతే తప్ప దీని గురించి క్లారిటీ రాదు. ఇదలా ఉంటే అసలు కల్కి ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ప్రభాసే కల్కి అని కొందరు అంటున్నారు. అబ్బే కల్కి ఎవరో కాదు విజయ్ దేవరకొండ(Vijay Devarkonda) అని చెబుతున్నారు. ఇంకొందరు దుల్కర్ సల్మాన్(dulqar Salman) కల్కిగా కనిపిస్తారని కామెంట్ చేస్తున్నారు. ఇలా కల్కి ట్రైలర్స్ చూసిన వారు ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. అయితే ఇక్కడే చాలా మంది ఓ లాజిక్ మిస్సవుతున్నారు. ఎందుకంటే సినిమాలో ప్రభాస్ హీరో అయినప్పుడు కల్కి ఇంకెవరో అయితే ప్రేక్షకులు అంగీకరించరు కదా! ఒకవేళ దర్శకుడు నాగ్ అశ్విన్ మరొకరిని కల్కి పాత్రలో చూపిస్తే కథను నడిపించడం కత్తిమీద సామే అవుతుంది. వచ్చే శుక్రవారం ఈ సస్పెన్స్‌కు తెరపడుతుంది. కల్కి ఎవరో తెలిసిపోతుంది. అప్పటి వరకు ఎదురుచూడక తప్పదు.