ప్రముఖ సంగీత దర్శకుడు(Music director), ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్(AR Rehman)- సైరాబాను(Syrabanu) దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రముఖ సంగీత దర్శకుడు(Music director), ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్(AR Rehman)- సైరాబాను(Syrabanu) దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 29 ఏళ్ల వారి వైవాహిక జీవితం ముగియబోతున్నది. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నారు. ఈ దంపతుల ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు అయ్యాయి. వారు కూడా సెటిల్ అయ్యారు. ఈ దశలో విడాకులు తీసుకోవడమేమిటన్న సందేహం చాలా మందికి వచ్చింది. అయితే వీరు విడాకులు(Divorce) ప్రకటించిన గంటల్లోనే రెహమాన్ మ్యూజిక్ ట్రూప్‌లోని బాసిస్ట్ మోహిన దే(Mohini dhe) కూడా తన భర్తకు విడాకులు ఇచ్చారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రెహమాన్-సైరా బాను విడాకులకు మోహినీ దేకు ఏమైనా కనెక్షన్ ఉందేమోనని పలువురు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో కథలు కథలుగా వస్తున్నాయి. అయితే ఈ కథనాలపై లాయర్ వందనా షా(Lawyar Vandhana shah) రియాక్టయ్యారు. ఈ వార్తలో నిజం లేదని చెప్పారు. పరస్పర అంగీకారంతోనే రెహమాన్-సైరా విడాకులు తీసుకుంటున్నారే తప్ప ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం ఏమీ లేదన్నారు. రెహమాన్ దంపతుల విడాకుల ప్రస్తావన వచ్చిన కొన్ని గంటల్లోనే మోహినీ దే కూడా తన భర్త మార్క్‌కు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించారు. పరస్పర అవగాహనతోనే తాము ఈ నిర్ణయానికి వచ్చామని మోహినీ దే, మార్క్ సంయుక్తంగా ఇచ్చిన ఓ ప్రకటనలో తెలిపారు.