నాగార్జున నటించిన కింగ్(King) సినిమాలో బ్రహ్మానందం పోషించిన మ్యూజిక్ డైరెక్టర్(Music director) పాత్ర గుర్తున్నది కదా!
నాగార్జున నటించిన కింగ్(King) సినిమాలో బ్రహ్మానందం పోషించిన మ్యూజిక్ డైరెక్టర్(Music director) పాత్ర గుర్తున్నది కదా! ఇది ఫలానా మ్యూజిక్ డైరెక్టర్‌ను టార్గెట్ చేస్తూ డిజైన్ చేసిందేనని అప్పట్లో చెప్పుకున్నారు. శ్రీను వైట్ల(Srinu Vaitla) అలా ఎందుకు చేసినట్టోనని గుసగుసలాడుకున్నారు. ఇప్పుడా టాపిక్ ఎందుకంటే రవితేజ(Ravi teja) లేటెస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్(Mr.Bachchan) రీసెంట్‌గా రిలీజయ్యింది. సినిమాకు పాజిటివ్ టాక్ అయితే రాలేదు కానీ చూసినవాళ్లు హీరోయిన్‌కు ఎక్కువ మార్కులు వేస్తున్నారు. అదలా ఉంచితే ప్రేక్షకులు ఎక్కువగా డిస్కస్ చేసిన విషయం మరోటి ఉంది. అది కమెడియన్ ప్రభాస్ చేసిన గురూజీ పాత్ర. సినిమాలో చమ్మక్ చంద్ర హీరో కావాలనుకుంటాడు. అతడిని మంచి హీరోను చేస్తానని చెప్పే మరో కమెడియన్ ప్రభాస్ శ్రీను(Prabhas srinu). ఈ ప్రభాస్ శ్రీనునే గురూజీ గురూజీ(Guruji) అని పిలుస్తుంటారు. ఈ గురూజీ పాత్ర దర్శకుడు త్రివిక్రమ్‌ను ఉద్దేశించి మలచినదేనన్నది ప్రేక్షకుల ఫీలింగ్. ఛా ఛా .. దర్శకుడు హరీశ్ శంకర్(Harish Shankar) అలా చేసే రకం కాదన్నది కొందరి అభిప్రాయం. సినిమా తీసిన పీపుల్స్ మీడియా(Peoples media factory) సంస్థతో త్రివిక్రమ్‌కు(Trivikram) మంచి రిలేషనే ఉంది. పైగా పవన్ కల్యాణ్‌తో(Pawan kalyan) చక్కటి అనుబంధం ఉంది. ఈ సంస్థ తీసిన బ్రో(BRO) సినిమాను సెట్ చేసిందే త్రివిక్రమ్. కాబట్టి పీపుల్స్ మీడియా సంస్థ ఇంత సాహసం చేయదు. చేసేవారిని కూడా చేయనివ్వదు. పవన్‌తో సినిమా చేస్తూ పవన్‌కు గురువులాంటి త్రివిక్రమ్‌ను గుర్తు చేసే పాత్రను హరీశ్ శంకర్ పెడతాడా? పెట్టడు కదా! కాబట్టి ఇవన్నీ ఊహాగానాలేనని మరికొందరు అంటున్నారు. సరే.. త్రివిక్రమ్‌ను టార్గెట్ చేయలేదనే అనుకుందాం! కానీ మాటిమాటికి గురూజీ గురూజీ అని అనిపించడం ఎందుకు? టాలీవుడ్‌లో గురూజీ అని పిలిపించుకునే ఏకైక వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాసే కదా! ఈ పాత్రను పెడితే ప్రేక్షకులకు అనుమానాలు కలగకుండా ఉంటాయా? ఈ విషయం హరీశ్‌కు తెలియకుండా ఉంటుందా? తను రూపొందిస్తున్న ఉస్తాద్ సినిమా వెనక్కి వెళ్లడానికి త్రివిక్రమే కారణమని హరీశ్ భావిస్తున్నట్టుగా ఉంది. అందుకే ఇలాంటి పాత్రను పెట్టాడేమోనని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. త్రివిక్రమ్‌పై హరీశ్ శంకర్‌కు ఎందుకంత కోపం అని కూడా