ఏ ఉద్దేశంతో మహేశ్‌బాబు(Mahesh babu) చెప్పారో తెలియదు కానీ అభిమానులు మాత్రం కంగారుపడిపోతున్నారు. గుంటూరుకారమే(Gutur Karam) తెలుగులో తన చివరి చిత్రం కావచ్చిన మహేశ్‌బాబు అనడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్‌లో వచ్చిన సినిమా గుంటూరుకారం.
ఏ ఉద్దేశంతో మహేశ్‌బాబు(Mahesh babu) చెప్పారో తెలియదు కానీ అభిమానులు మాత్రం కంగారుపడిపోతున్నారు. గుంటూరుకారమే(Gutur Karam) తెలుగులో తన చివరి చిత్రం కావచ్చిన మహేశ్‌బాబు అనడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్‌లో వచ్చిన సినిమా గుంటూరుకారం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్‌బాబు సినిమాలో నెక్లెస్ పాటతో పాటు కుర్చి పాట కూడా ఉండాలని ముందే నిర్ణయించుకున్నామని చెప్పారు. సినిమా షూటింగ్ సమయంలో చాలా ఎంజాయ్ చేశామన్నారు. రెండు మాస్ పాటలు ఉండాల్సిందేనని తాను, త్రివిక్రమ్ ముందుగానే అనుకున్నామని మహేశ్ తెలిపాడు. ఈ సినిమా తర్వాత తెలుగులో సినిమా చేసే అవకాశం వస్తుందో రాదో తెలియదన్నాడు.
బహుశా ఇదే నా చివరి తెలుగు చిత్రం కావొచ్చని, అందుకే మాస్ సాంగ్స్ ఉండాలనుకున్నామని అన్నాడు. 'ఈ సినిమాలోనే నా డ్యాన్స్ అంతా చూపించాలనుకున్నాను. కుర్చి పాట నా కెరీర్ బెస్ట్ కావాలని శేఖర్ మాస్టర్‌తో(Shekar Master) చెప్పాను. ఆయన అలాంటి స్టెప్పులే కంపోజ్ చేశాడు. శ్రీలీలతో కలిసి స్టెప్పులేయడానికి చాలా టెన్షన్ పడ్డాను. నెక్లెస్ పాటను అనుకున్నదాని కంటే ముందే పూర్తి చేశాం. తర్వాత నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. కుర్చి సాంగ్ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు, అంటే డిసెంబర్ 22న పూర్తి చేశాం. చాలా అద్భుతంగా అనిపించింది. నా కెరీర్ బెస్ట్ సాంగ్ ఇదే’ అని మహేశ్‌బాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మహేశ్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నిజంగానే ఇది మహేశ్ చివరి తెలుగు సినిమానా? మళ్లీ చేయరా? అని నెటిజన్లు డౌట్ పడుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ ఓ సినిమా చేస్తున్నారు. రాజమౌళి సినిమా కాబట్టిదానికి ఈజీగా రెండేళ్లకు పైనే పడుతుంది. ఆ సినిమాతో మహేశ్ పాన్ ఇండియా స్టార్ అవుతాడు. అందుకే ఆ మాటన్నాడు కాబోలని కొందరు అంటున్నారు.