✕
Saidharam Tej - Virupaksha : వినూత్న ప్రక్రియ విరూపాక్ష పాత్రల పరిచయం
By EhatvPublished on 4 April 2023 1:29 AM GMT
సుప్రీం హీరో సాయిదర్శతేజ(Sai Dharam Tej) హీరోగా కార్తీక్ దర్శకత్వంలో సుప్రసిద్ధ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన విలక్షణ కధా చిత్రం విరూపాక్ష(Virupaksha) చిత్రానికి సంబంధించిన పాత్రల పరిచయం కార్యక్రమం ఆదివారం సాయంత్రం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో ప్రత్యేకంగా రూపొదించిన బారీ సెట్లో ఆసక్తికరంగా జరిగింది. ఇంతవరకూ ఎవ్వరూ చేయని విధంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్.

x
Saidharam Tej – Virupaksha
-
- సుప్రీం హీరో సాయిదర్శతేజ హీరోగా కార్తీక్ దర్శకత్వంలో సుప్రసిద్ధ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన విలక్షణ కధా చిత్రం విరూపాక్ష చిత్రానికి సంబంధించిన పాత్రల పరిచయం కార్యక్రమం ఆదివారం సాయంత్రం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో ప్రత్యేకంగా రూపొదించిన బారీ సెట్లో ఆసక్తికరంగా జరిగింది. ఇంతవరకూ ఎవ్వరూ చేయని విధంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్. సుకుమార్ రైటింగ్స్ తో సంయుక్తంగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న విరూపాక్ష చిత్రం హారర్‌తో కూడిన విభన్న కథాంశంతో రూపొందుతున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించిన విజువల్స్‌ని కూడా మీడియాకి ప్రదర్శించారు. ఇది ఆద్యంతం టెక్నీషియన్స్ చిత్రంగా చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ అభివర్ణించిన ఈ చిత్రానికి పని చేసిన అందరి సాంకేతిక నిపుణుల అనుభవాలు, వారివారి అభిప్రాయాల ఏవిని ప్లే చేయడంతో సినిమా మీద ఎవ్వరికైనా ఊహకు మించిన అంచనాలు మనసులో మెదులుతాయి. విరూపాక్ష కథావాతావరణానికి కావాల్సిన రుద్రవరం అనే Fictional Vilageని ఏవిధంగా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర డిజైన్ చేశారు, ఆ డిజైన్ని మళ్ళీ ఏ విధంగా నిర్మించారు అనే ప్రాసెస్‌ని కళ్ళకు కట్టినట్టుగా వీడియో ద్వారా చూపించడం కొత్తగా అనిపించింది.
-
- తర్వాత, విరూపాక్ష చిత్రంలో పాత్రలన్నీ వేదిక మీదకి వచ్చి తమతమ పాత్రల గురించి క్లుప్తంగా వివరిస్తూ, హాస్యధోరణిలో ప్రజెంట్ చేయడంతో కార్యక్రమం రక్తి కట్టడమే కాదు, అందరిలో ఎక్సైట్మెంట్ కలిగింది సినిమా మీద. రుద్రవరం గ్రామ ఆలయంలో పూజారి పాత్రను పోషించిన సీనియర్ నటుడు సాయిచంద్, అఘోర పాత్రను సోషించిన యంగ్ విలన్ అజయ్, గ్రామంలో ఆర్ఎంపి పాత్రను పోషించిన బ్రహ్మాజీ, గ్రామ సర్పంచ్ అబ్బాయిరాజుగా విలన్ పాత్రను పోషించిన సునీల్, హీరోయిన్ సంయుక్తా మీనన్, హీరో సాయిధర్మ తేజ....అందరూ వేదిక మీదకి వచ్చి సినిమాలో కనిపించే గెటప్ల్లోనే మీడియ సమక్షంలో తమపాత్రలను పరిచయం చేసుకోవడంతో విరూపాక్షకి పబ్లిసిటీ పరంగా అభినందనీయమైన మైలేజ్ లభించినట్టయింది.
-
- ఎన్నో చిత్రాలకు సంబంధించి అనేకమైన ఈవెంట్స్ జరగడం, వాటికి మీడియాని ఆహ్వానించడం చిరకాలంగా కొనసాగుతున్న ఆనవాయితీయే. కానీ, ఇటువంటి స్పెషల్ ప్రోగ్రామ్ ఇంతవరకూ ఏ సంస్థా డిజైన్ చేయలేదు. పెరఫార్మ్ చేయలేదు. సినిమా కోసమని ఇంత విభిన్నమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేశారంటే సినిమా ఇంకెంత ఆసక్తికరంగా ఉంటుందన్నది ఊహించడం కష్టం కాదు. విరూపాక్ష చిత్రలో అత్యంత కీలకమైన పాత్రలనే వేదిక మీదకి తీసుకురావడం, కధను భుజాలకెత్తుకున్న ఈ ముఖ్యపాత్రలన్నీ శ్రమ అనుకోకుండా ఆయా గెటప్ల్లో ఈవెంట్‌కి హాజరుకావడం గ్యారెంటీగా ఎందరికో ఒక ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు.
-
- సాయిచంద్ అచ్చంగా పూజారీ వేషంలో వచ్చి, సినిమా వివరాలు చెబుతుంటే విచిత్రంగా అనిపించింది. బ్రహ్మాజీ ఆర్ఎంపి పాత్ర కాబట్టి డాక్టర్గారి బేగ్, స్టెతస్కోపు పట్టుకుని వచ్చి మాట్లాడబోతుంటే తోటి నటీనటులు బ్రహ్మాజిని మాట్లాడనివ్వకుండా అడుగడుగునా అడ్డుపడుతూ ఆటపట్టించారు. బ్రహ్మాజీ కూడా వాళ్ళని ఉద్దేశిస్తూ మాట్లాడనివ్వండిరా బాబూ అని ప్రాధేయపడడం గొప్ప ఆసక్తిని క్రియేట్ చేసింది. సంయుక్తామీనన్ మాత్రం ప్రత్యేకంగా తన ఆనందాన్ని అస్సలు దాచుకోలేకపోయింది. అంత మంచి పాత్ర తనకు దొరికినందుకు, అంత మంచి సినిమాలో నటించగలిగినందుకు పట్టరాని సంతోషాన్ని ప్రతీమాటలోనూ ప్రతిబింబిస్తూ చాలా హుషారుగా మాట్లాడి ఫంక్షన్‌కి తెలియని ఆకర్షణని ఆద్దింది. అఘోర గెటప్‌లో వచ్చిన ఆజయ్ ఆ పాత్ర మేకప్ చేసుకుంటున్నప్పుడు లోనైన విచిత్రమైన అనుభవం, అనుభూతిని చెబుతూ, దాదాపుగా ఆ పాత్ర గెటప్ వేసుకోవడానికి గంటగంటన్నర టైం పట్టిందని, అయినా విరూపాక్షలో ఆ పాత్రకున్న విశిష్టత కారణంగా తాను చాలా ఎంజాయ్ చేసినట్టుగా చెప్పాడు.
-
- చివరిగా మాట్లాడిన సాయిధర్మ తేజ్ తనపాత్ర కన్నా తన తోటిపాత్రలను గురించే ఎక్కువగా ముచ్చటించి, అందరితోనూ తానూ ఈ చిత్రంలో చేసినందుకు ఎక్కువ హేపీనెస్ని వ్యక్తం చేయడమే ఫంక్షన్‌కి హైలైట్. హారర్‌తో కూడిని ఉత్కంఠభరితమైన కథాకథనాలు విరూపాక్ష చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ అని తేజ్ చెప్పుకుంటూ వచ్చాడు. చాలా సన్నివేశాలు భయపెడతాయని, హారర్ అంటే ఎవరికి భయముండదని అంటూ, తనకి విరూపాక్షలో నటించడం చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అని, తప్పనిసరిగా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని పదేపదే చెప్పడం విశేషం. దర్శకుడు కార్తీక్ వర్మ చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా విరూపాక్షలాటి చిత్రాన్ని ఎక్స్పర్ట్లా హేండిల్ చేయడాన్ని యూనిట్ మొత్తం మెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదలవుతున్న్ విరూపాక్ష చిత్రం ప్రజెంట్ ట్రెండ్స్ ప్రకారం తప్పక సూపర్ హిట్ అవుతుందని అనుకోవడానికి అన్ని అర్హతలూ ఉండడమే విశేషమైన ప్రత్యేకత.... " Written By : Nagendra Kumar "

Ehatv
Next Story