పెద్దపెద్ద స్టార్లు లేని ఈ చిన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద దాని బడ్జెట్ కంటే 45 రెట్లు సంపాదించి

పెద్దపెద్ద స్టార్లు లేని ఈ చిన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద దాని బడ్జెట్ కంటే 45 రెట్లు సంపాదించి, ఆ సంవత్సరంలోని కొన్ని అతిపెద్ద భారతీయ బ్లాక్‌బస్టర్‌లను అధిగమించింది. 2024 భారతీయ సినిమాకు బ్లాక్ బస్టర్ సంవత్సరం. రెండు సినిమాలు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు దాటగా, ఒకటి మార్కుకు చేరువైంది. ఈ మూడు చిత్రాలు - పుష్ప 2: ది రూల్, కల్కి 2898 AD, మరియు స్త్రీ 2 - ఈ సంవత్సరంలో అతిపెద్ద బాక్సాఫీస్ హిట్స్ అని ఎవరైనా చెప్తారు. అయితే, అత్యంత లాభదాయకమైన భారతీయ చిత్రం గురించి మాట్లాడితే పెద్ద స్టార్స్ లేని

రూ.3 కోట్ల చిత్రానికి దక్కింది.

మలయాళ రొమాంటిక్ డ్రామా 'ప్రేమలు' 2024లో అత్యంత లాభదాయకమైన భారతీయ చలనచిత్రం. పెద్ద తారాగణం లేకుండా కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ చిత్రం తొలుత నిదానంగా ఆడింది. కానీ మౌత్‌ టాక్‌ ఈ సినిమాకు కనక వర్షం కురిపించింది. చివరికి, ఇది రూ.136 కోట్లను సంపాదించి, ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇది ఆర్జించిన 45 రెట్ల లాభం ఈ సంవత్సరం ఏ భారతీయ చలనచిత్రానికైనా అత్యధికం

ehatv

ehatv

Next Story