ఆదిపురుష్‌(Adipurush) సినిమాతో కాసింత డీలాపడిన ప్రభాస్‌ ప్యాన్స్‌ ఇప్పుడు సలార్‌(Salar)పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో అంతా మంచే జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నారు. గ్లోబల్‌స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న క్రేజీ సినిమాలలో ప్రాజెక్ట్‌ కే(Project K) ఒకటి. ఇందులో అగ్రశ్రేణి తారాగణమంతా నటిస్తోంది. దశాబ్దాలుగా భారతీయ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశ్వనాయకుడు కమల్‌హాసన్‌(Kamal Haasan)

ఆదిపురుష్‌(Adipurush) సినిమాతో కాసింత డీలాపడిన ప్రభాస్‌ ప్యాన్స్‌ ఇప్పుడు సలార్‌(Salar)పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో అంతా మంచే జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నారు. గ్లోబల్‌స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న క్రేజీ సినిమాలలో ప్రాజెక్ట్‌ కే(Project K) ఒకటి. ఇందులో అగ్రశ్రేణి తారాగణమంతా నటిస్తోంది. దశాబ్దాలుగా భారతీయ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశ్వనాయకుడు కమల్‌హాసన్‌(Kamal Haasan)తో కలిసి నటించడం పట్ల ప్రభాస్‌ చాలా ఉద్విగ్నతకు లోనవుతున్నాడు. ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్‌ నగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో ఆ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకోనే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌బ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. లోకనాయకుడు కమలహాసన్‌ కూడా ఇందులో కీ రోల్‌లో నటిస్తున్నాడు. కమల్‌హాసన్‌కు సంబంధించిన ఓ స్పెషల్ వీడియో విడుదల చేస్తూ తన ఆనందాన్ని అందరితోనూ పంచుకున్నాడు ప్రభాస్‌. ' నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం ఇది. ప్రాజెక్ట్‌ కేలో లెజండరీ నటుడు కమలహాసన్‌ సర్‌తో కలిసి పని చేసినందుకు మాటల్లో చెప్పలేనంత గౌరవంగా భావిస్తున్నా. కల నిజమైన వేళ. టైటాన్‌ ఆఫ్‌ సినిమాతో కలిసి నేర్చుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను' అంటూ తన ఎక్జయిట్‌మెంట్‌ను అందరితో పంచుకున్నాడు ప్రభాస్‌. ఇప్పుడీ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌తో సమానంగా కమలహాసన్‌కు పాతితోషికం ఇస్తున్నారట. ప్రాజెక్ట్‌ కేలో కీలకంగా సాగే రైడర్స్‌ కాస్ట్యూమ్స్‌ మేకింగ్‌, అసెంబ్లీంగ్‌ వీడియోను మేకర్స్‌ ఇప్పటికే విడుదల చేశారు. ఇది కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
ఇప్పటికే విడుదల చేసిన దీపికా పదుకొనే లుక్‌ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతున్నదో చెప్పేసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కేతో పాటు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సలార్‌లో, మారుతి దర్శకత్వంలో హారర్‌ కామెడీ సినిమాలో నటిస్తున్నారు.

Updated On 26 Jun 2023 1:27 AM GMT
Ehatv

Ehatv

Next Story