ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes International Film Festival) రెండు రోజుల కిందట ప్రారంభమయ్యింది. కేన్స్ చిత్రోత్సవం అంటే సినీ ప్రియులకే కాదు, ఫ్యాషన్ లవర్స్ కూడా ఇష్టమైన వేడుక. ప్రతి సంవత్సరం మన దేశం నుంచి కొందరు హీరోయిన్స్ అక్కడ సందడి చేస్తుంటారు.

Cannes Film Festival
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes International Film Festival) రెండు రోజుల కిందట ప్రారంభమయ్యింది. కేన్స్ చిత్రోత్సవం అంటే సినీ ప్రియులకే కాదు, ఫ్యాషన్ లవర్స్ కూడా ఇష్టమైన వేడుక. ప్రతి సంవత్సరం మన దేశం నుంచి కొందరు హీరోయిన్స్ అక్కడ సందడి చేస్తుంటారు. రెడ్ కార్పెట్‌పై హోయలు ఒలికిస్తూ ఆహుతులను అలరిస్తుంటారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సీతారామం సినిమా ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal takkur) మొదటిసారి పాల్గొంటున్నారు. రెడ్ కార్పెట్‌పై సందడి చేసే ముందు మృణాల్ ఠాకూర్ అందమైన చీరకట్టులో తీయించుకున్న కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు.
కేన్స్ ఫిల్మ్‌ఫెస్ట్‌వల్‌లో పాలుపంచుకోవడం అరుదైన అవకాశమన్నారు. ఆరు గజాల చీరలోనే అసలైన అందం దాగి ఉంటుందని పేర్కొన్నారు. చీరకట్టులో తాను నిజమైన భారతీయ మహిళగా ఫీలవుతున్నానని తెలిపారు. రెడ్‌కార్పెట్‌పై నడిచే సమయం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని, తన జీవితంలో ఇదొక మధురమైన క్షణమని చెప్పారు. చీరకట్టులో మృణాల్ ఠాకూర్ ఫోటోలకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. పలువురు సినీ తారలు ఆమెను మెచ్చుకున్నారు. మ్యాజికల్ లుక్‌తో కనిపిస్తున్నావంటూ మృణాల్‌కు టాప్‌స్టార్ సమంత కితాబిచ్చారు. మరో హీరోయిన్ ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) కూడా ఆహుతులను ఆకట్టుకున్నారు. ఆమె రెడ్ కార్పెట్‌పై నడుస్తుంటే అక్కడ ఉన్న కొందరు ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్లు ‘ఐశ్వర్య... ఐశ్వర్య’(Aishwarya) అంటూ పిలిచారు. వారు అలా పిలిచేసరికి ఎలా స్పందించాలో అర్థం కాలేదని ఊర్వశి అన్నారు.
