మాజీ మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌ది(Sushmitha sen) భిన్నమైన వ్యక్తిత్వం. అందమే కాదు అభినయమూ గొప్పగా ఉంటుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. బోల్డ్‌ స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు. జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ ఫ్యాన్స్‌ను ఇస్‌స్పైర్‌ చేస్తుంటారు. లాస్టియర్‌ ఆమె అనారోగ్యానికి గురయ్యారు. నిరుడు మార్చిలో ఆమెకు గుండెపోటు(Heart attack) వచ్చింది. ఫలితంగా స్టెంట్‌ అమర్చాల్సి వచ్చింది. ఆమె తన ఆనారోగ్యాన్ని ఎక్కడా దాచుకోలేదు.

మాజీ మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌ది(Sushmitha sen) భిన్నమైన వ్యక్తిత్వం. అందమే కాదు అభినయమూ గొప్పగా ఉంటుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. బోల్డ్‌ స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు. జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ ఫ్యాన్స్‌ను ఇస్‌స్పైర్‌ చేస్తుంటారు. లాస్టియర్‌ ఆమె అనారోగ్యానికి గురయ్యారు. నిరుడు మార్చిలో ఆమెకు గుండెపోటు(Heart attack) వచ్చింది. ఫలితంగా స్టెంట్‌ అమర్చాల్సి వచ్చింది. ఆమె తన ఆనారోగ్యాన్ని ఎక్కడా దాచుకోలేదు. ప్రతి ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెబుతూ వచ్చారు. చివరిసారిగా ఆర్య సీజన్‌ 3లో నటించిన సుస్మితా సేన్‌ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు చెప్పారు. తన తల్లిదండ్రులిద్దరూ హార్ట్ పేషెంట్లేనని, అందుకే తాను అత్యంత జాగ్రత్తగా ఉండేదానినని అన్నారు. గుండెపోటు తర్వాత తాను ఆపరేషన్ థియేటర్‌లో నవ్వుతున్నానని సుస్మిత చెప్పారు. అలాగే ట్రీట్‌మెంట్‌ తర్వాత తన లైఫ్‌ స్టయిల్‌లో వచ్చిన మార్పుల గురించి కూడా చెప్పారు. తాను చాలా హ్యాపీ గోయింగ్‌ మనిషిని అని అన్నారు. అలాగే తన ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌(Autoimmune disease) గురించి కూడా సుస్మితా సేన్ నిస్సంకోచంగా చెప్పుకొచ్చారు. తన జీవితంలో పెద్ద సమస్య అని, ఆ సమయంలో తన మెదడు మొద్దు బారి పోయిందనీ, ఇప్పటికీ చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకోలేకపోతున్నానని తెలిపారు. 2014లోనే సుస్మితకు ఆడిసన్స్ వ్యాధి సోకింది. ఇది ఆటో ఇమ్యున్ సిస్టంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే డిప్రెషన్‌కు లోనైంది. కార్టిసోల్ వంటి స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల విపరీతమైన సైడ్ ఎఫెక్ట్ లతో బాధపడ్డానని సుస్మిత వివరించారు. ప్రస్తుతం తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని సుస్మిత అన్నారు

Updated On 20 Feb 2024 5:41 AM GMT
Ehatv

Ehatv

Next Story