టాలీవుడ్(Tollywood)లో భారీ ఎత్తున సినిమాలు తీసిన మైత్రీ మూవీస్ సంస్థ(Mythri Movie Makers)పై ఐటీ అధికారులు దాడులు(IT Raids) నిర్వహించిన సంగతి తెలిసిందే కదా! అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్(Pan India Sukumar) ఇళ్లపైనా, ఆఫీసులపైనా కూడా దాడులు జరిగాయి. అయిదు రోజుల పాటు జరిగిన ఈ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మైత్రీ మూవీస్ పెట్టుబడులపై ఐటీ శాఖ కీలక సమాచారం రాబట్టినట్టు జాతీయ మీడియా చెబుతోంది.
టాలీవుడ్(Tollywood)లో భారీ ఎత్తున సినిమాలు తీసిన మైత్రీ మూవీస్ సంస్థ(Mythri Movie Makers)పై ఐటీ అధికారులు దాడులు(IT Raids) నిర్వహించిన సంగతి తెలిసిందే కదా! అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్(Pan India Sukumar) ఇళ్లపైనా, ఆఫీసులపైనా కూడా దాడులు జరిగాయి. అయిదు రోజుల పాటు జరిగిన ఈ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మైత్రీ మూవీస్ పెట్టుబడులపై ఐటీ శాఖ కీలక సమాచారం రాబట్టినట్టు జాతీయ మీడియా చెబుతోంది. మైత్రీ సంస్థలోకి 700 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చినట్టు ఐటీ శాఖ గుర్తించింది.
ఈ 700 కోట్ల రూపాయల నిధులు మొదట ముంబాయి(Mumbai)కి చెందిన ఓ కంపెనీకి బదిలీ అయ్యాయట! తర్వాత ఆ మొత్తాన్ని ఏడు కంపెనీలకు తరలించారట! వాటి నుంచి మైత్రీ మూవీస్‌కు పెట్టుబడుల రూపంలో వచ్చినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. అలాగే హవాలా ద్వారా ఓ బాలీవుడ్ అగ్రదర్శకుడికి 150 కోట్ల రూపాయలను చెల్లించినట్టు ఐటీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ నిర్మిస్తున్న సీక్వెల్ మూవీ హీరోకు కూడా హవాలా రూపంలోనే చెల్లింపులు జరిగినట్టు తెలుస్తోంది. గత రెండేళ్లుగా ఇద్దరు పెద్ద హీరోలకు కూడా ఇదే విధంగా చెల్లింపులు జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఆ హీరోల ఖాతాను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారని జాతీయ మీడియా చెబుతోంది. హీరోల రెమ్యునరేషన్ కూడా హవాలా పద్దతిలోనే ఈ సంస్థ చెల్లించిందట!
ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) వ్యవహారంలో పలువురు హీరోలను కూడా విచారణకు పిలవడానికి ఐటీ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. మైత్రీ సంస్థ హీరోలకు ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చిపడింది. పవన్ కల్యాణ్(Pawan Kalyan), అల్లు అర్జున్(Allu Arjun), ప్రభాస్(Prabhas), మహేశ్‌బాబు(Mahesh Babu), జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR), రామ్‌చరణ్(Ram Charan) .. ఇలా పెద్ద హీరోలందరికి మైత్రీ సంస్థ అడ్వాన్సులు, రెమ్యునరేషన్లు ఇచ్చింది. ఈ హీరోలను ఐటీ శాఖ విచారణకు పిలిచే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్(Filmnagar)లో టాక్ వినిపిస్తోంది. హవాలా వ్యవహారం ఉంది కాబట్టి ఈడీ అధికారులు కూడా దీనిపై దృష్టి పెట్టారట!