ఈ ఏడాది చిన్న సినిమాలు.. మినీబడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు సత్తా చాటాయి. బడ్జెట్(Budget) తక్కువయినా.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. అందులో మరీ ముఖ్యంగా బలగం సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ అంతా ఇంతా కాదు. తెలంగాణ(Telangana) పల్లెల విషయాలను కళ్ళకు కట్టినట్టు చూపించడంతో ఈమూవీ సక్సెస్ అయ్యింది. చిన్న సినిమాగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ బలగం.

2024 కోటి ఆశలతో స్వగతంపలుకుతుంది. కొత్త ఏడాది ఫిల్మ్ ఇండస్ట్రీ(Film Industry) కూడా ఎన్నో కలలతో స్టార్ట్ చేయబోతోంది. ఇక 2023 లో జ్ఞాపకాలునెమరు వేసుకుంటుంది సినీ పరిశ్రమ.

ఈ ఏడాది చిన్న సినిమాలు.. మినీబడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు సత్తా చాటాయి. బడ్జెట్(Budget) తక్కువయినా.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. అందులో మరీ ముఖ్యంగా బలగం సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ అంతా ఇంతా కాదు. తెలంగాణ(Telangana) పల్లెల విషయాలను కళ్ళకు కట్టినట్టు చూపించడంతో ఈమూవీ సక్సెస్ అయ్యింది. చిన్న సినిమాగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ బలగం.

బాక్సాఫీస్(Box office) దగ్గర బలగం హవా గట్టిగా నడిచింది. భారీ వసూళ్లను రాబట్టడంతో పాటు.. ఇండస్ట్రీ చూపంతా తనవైపు తిప్పుకుంది. అంతే కాదు.. ఈ ఒక్క సినిమానే నేషనల్ లెవల్ తో పాటు... లోకల్ గా కూడా దాదాపు 100 పైగా అవార్డ్ లు(Awards) సాధించిన బలగం సినిమా.. బుల్లితెర పై కూడా తన హవా చూపించింది. హవా అంటే అంతా ఇంతా హవా కాదు టెలివిజన్(Television) రంగంలోనే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఏడాది టాప్ టీఆర్పీ(TRP) రేటింగ్ ను నమోదు చేసుకున్న చిత్రం గా బలగం నిలిచింది. 14.21 టీఆర్పీ రేటింగ్ ను ప్రీమియర్ టెలికాస్ట్ లో సొంతం చేసుకుంది.

జబర్థస్త్(Jabardast) కమెడయిన్ గా పేరు పొందిన వేణు దర్శకుడిగా మారి... టాలీవుడ్ స్టార్ కమెడియన్ ప్రియదర్శి(Priyadarshi) హీరోగా.. కావ్యకళ్యాణ్ రామ్ హీరోయిన్ గా. బలగం చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం టీవీ లో ప్రసారం అయిన ప్రతిసారీ కూడా మంచి టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఒక వైపు నవ్వులు పూయిస్తూనే.. సెంటిమెంట్ తో(Sentiment) కంటతడి పెట్టిచాడు దర్శకుడు వేణు. ఇక ఈసినిమాకు బీమ్స్ సంగీతం ప్రాణం పోసిందని చెప్పాలి.

Updated On 30 Dec 2023 8:25 AM GMT
Ehatv

Ehatv

Next Story