బాలీవుడ్‌లో బ్రహ్మాండమైన హిట్ సినిమాలోల నటించిన స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా తర్వాత హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు. బాలీవుడ్‌లో దాదాపు అగ్రహీరోలందరితో నటించారు ప్రియాంక చోప్రా. మిస్‌ వరల్డ్‌ కిరీటం దక్కించుకున్న ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్‌లో బిజీగా ఉంది. ఇటీవలే ఆమె నటించిన సిటాడెల్ వెబ్‌ సిరీస్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా సిటాడెల్ ప్రమోషన్లలో పాల్గొన్న ప్రియాంక పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. సెక్స్‌ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

బాలీవుడ్‌లో బ్రహ్మాండమైన హిట్ సినిమాలోల నటించిన స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తర్వాత హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు. బాలీవుడ్‌లో దాదాపు అగ్రహీరోలందరితో నటించారు ప్రియాంక చోప్రా. మిస్‌ వరల్డ్‌ (Miss World) కిరీటం దక్కించుకున్న ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్‌లో బిజీగా ఉంది. ఇటీవలే ఆమె నటించిన సిటాడెల్ (Citadel) వెబ్‌ సిరీస్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా సిటాడెల్ ప్రమోషన్లలో పాల్గొన్న ప్రియాంక పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. సెక్స్‌ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫస్ట్ డేట్‌లోనే శృంగారానికి ఒప్పుకుంటారా అని అడిగిన ప్రశ్నకు ఆమె షాకింగ్ అన్సర్‌ ఇచ్చింది. ఫస్ట్ డేట్‌లోనే శృంగారానికి ఒప్పుకుంటానంది. దీనివల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడుతుందని. భవిష్యత్‌లో మనతో ఎలా ఉంటాడో అనే విషయాలు తెలుస్తాయంటూ వివరణ ఇచ్చింది. పెళ్లికి ముందు చాలా మందితో డేటింగ్ చేశానని ప్రియాంక చెప్పారు. కాకపోతే ఆ రిలేషన్‌ ఎక్కువ కాలం నిలవలేదన్నారు.

ఇండస్ట్రీలోని గొప్ప వ్యక్తులతో డేటింగ్ చేశానని చెప్పారు. ఆ తర్వాత ప్రియాంక చోప్రా హాలీవుడ్ సింగర్, నటుడు నిక్ జోనస్‌తో (Nick Jonas) ప్రేమాయణం కొనసాగించారు. కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన వీరిద్దరు 2018లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. లాస్టియర్‌ ప్రియాంక చోప్రా సరోగసి ద్వారా ఒక పాపకు జన్మనిచ్చింది. ఇటీవలే తన బిడ్డతో కలిసి ఇండియాలో కూడా పర్యటించింది.

Updated On 17 May 2023 2:28 AM GMT
Ehatv

Ehatv

Next Story