కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్ లోనే టాలీవుడ్(Tollywood) ను వదిలేసింది హీరోయిన్ ఇలియానా... ఇక అప్పటి నుంచి ఆమెకు ఇబ్బందులు తప్పలేదు. బాలీవుడ్ లోకి(Bollywood) ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. అదే సమయంలో ప్రేమలో పడటం.. ఆతర్వాత ఆ ప్రేమ బ్రేకప్ అవ్వడం. అది తట్టుకోలేక ఆమె డిప్రషన్ లోకి వెళ్లడం..లావవ్వడం జరిగిపోయాయి. ఆతర్వాత తిరిగి నార్మల్ గా మారిపోవడం వెంట వెంటనే జరిగిపోయాయి.

చాలా కాలంగా చాలా మంది సినీ జనాలకు ఉన్న అనుమానం.. ఇలియానా(Ileana) ప్రియుడు ఎవరు..? ఆమె ప్రగ్నంట్ ఎలా అయ్యింది అని. సోషల్ మీడియాలో అభిమానులు ఎంత అడిగినా.. ఏమాత్రం రెస్పాండ్ అవ్వని ఇలియానా..తాజాగా తన ప్రియుడు ఎవరో రివిల్ చేసింది.

కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్ లోనే టాలీవుడ్(Tollywood) ను వదిలేసింది హీరోయిన్ ఇలియానా... ఇక అప్పటి నుంచి ఆమెకు ఇబ్బందులు తప్పలేదు. బాలీవుడ్ లోకి(Bollywood) ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. అదే సమయంలో ప్రేమలో పడటం.. ఆతర్వాత ఆ ప్రేమ బ్రేకప్ అవ్వడం. అది తట్టుకోలేక ఆమె డిప్రషన్ లోకి వెళ్లడం..లావవ్వడం జరిగిపోయాయి. ఆతర్వాత తిరిగి నార్మల్ గా మారిపోవడం వెంట వెంటనే జరిగిపోయాయి.

ఒకప్పుడు స్టార్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది జీరో సైజ్ ముద్దుగుమ్మ ఇలియానా . వివినాయక్ దర్శకత్వం వహించిన దేవదేసు(Devadasu) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలను కవర్ చేసింది ఇలియానా. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. వరుస సినిమాలతో దూసుకుపోయింది. ముఖ్యంగా మహేష్ బాబు(Mahesh Babu) పోకిరి(Pokiri), పవన్ కళ్యాణ్(Pawan kalyan) జల్సా(Jalsa), రవితేజ(Raviteja) కిక్(Kick) సినిమాలు ఈ అమ్మడి కెరీర్ ఓ రేంజ్ లో వెలిగిపోయింది.

ఇక ఆ మధ్య బాగా సన్నగా మారిపోయిన ఇలియానా.. ఫిజిక్ మీద గట్టిగా ద దృష్టి పెట్టింది బ్యూటీ. అయితే సడెన్ గా తాను గర్బవతిని(Pregnant) అని ప్రకటించిన ఇలియానా.. దానికి కారణం ఎవరో చెప్పలేదు. పెళ్ళి లేదు.. ప్రేమిస్తున్నట్టు చెప్పలేదు.. సడెన్ గా ప్రగ్నెంట్ అనేసింది. ఇంతకు ముందు బ్రేకప్ అవ్వడంతో ఇక ప్రేమ జోలికి వెళ్ళదేమో అనుకుంటే.. ఈసారి ఏకంగా గర్బతిగా మారింది.

ఇక అప్పటి నుంచి జనాలు అసలు.. ఆరాలు తియ్యడం మొదలు పెట్టారు. ఈ అమ్మడు ప్రేమలో ఎప్పుడు పడింది..? అంటూ ప్రశ్నించారు ఇల్లు బేబీ ఫ్యాన్స్. ఇక వరుసగా బేబీ బంప్ తో ఫోటోలను షేర్ చేసింది ఇలియానా.. కారణం ఎవరో మాత్రం చాలారోజులు ప్రకటించకుండా.. గోప్యంగా ఉంచింది. ఎప్పుడెప్పుడు తన ప్రియుడిని ప్రకటిస్తుందా అని ఎదరు చూస్తున్న ఫ్యాన్స్ కు తాజాగా అతన్ని ప్రకటించేసింది.

తాజాగా ప్రియుడు ఫేస్ రివీల్ చేసింది ఇలియానా. తొలిసారిగా త‌న బాయ్‌ఫ్రెండ్‌ ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. అయితే ఈ ఫొటోలో ప్రియుడు ఫేస్ సరిగ్గా కనిపించంలేదు. ఈ ఫోటో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ అనేది నాకు పెద్ద వరం. త్వరలో నేను నా బేబీని కలుస్తాను. నా బేబీ బంప్‌(Baby bump) చూస్తుంటే చాలా ముద్దొస్తుంది. నేను ఇప్పుడు ఇంకా చాలా అందంగా ఉన్నాను అంటూ రాసుకొచ్చింది ఇలియానా.

కొన్ని కష్టమైన రోజులు చూశాను. నాకెంతో నిస్సహాయత రోజులను చూశాను. అలాంటి వాటి నుంచి బయటకు రావాలనుకున్నాను. కన్నీళ్లు కూడా కార్చాను. బాధపడ్డాను. అలాంటి సమయంలో నేను బాధపడకూడదు ధైర్యంగా ఉండాలనుకున్నాను అంటూ తన జీవితంలో కష్టాల గురించి రాసింది.

Updated On 10 Jun 2023 11:44 PM GMT
Ehatv

Ehatv

Next Story