పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది గోవా బ్యూటీ ఇలియానా. ఇప్పటికే నెలలు నిండి ఉన్న పోకిరి భామ మరికొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ప్రెగ్నంట్ అయినప్పటి నుంచి ఏమాత్రం మెహమాట పడకుండా.. బేబి బంప్‌ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తునే ఉంది. ఇటీవలే ఈ బ్యూటీ తొమ్మిదో నెల నడుస్తొందని.. గర్భంతో ఏ పనిచేయలేకపోతున్నానని, ఒంట్లో ఎంతో నీరసంగా ఉందని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కోంది.

ఎట్టకేలకు తన బిడ్డకు తండ్రిని పరిచయం చేసింద ఇలియానా(Ileana)..? తన ప్రియుడిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది.

పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది గోవా బ్యూటీ ఇలియానా. ఇప్పటికే నెలలు నిండి ఉన్న పోకిరి భామ మరికొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ప్రెగ్నంట్ అయినప్పటి నుంచి ఏమాత్రం మెహమాట పడకుండా.. బేబి బంప్‌ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో(Social Media) పోస్ట్ చేస్తునే ఉంది. ఇటీవలే ఈ బ్యూటీ తొమ్మిదో నెల నడుస్తొందని.. గర్భంతో ఏ పనిచేయలేకపోతున్నానని, ఒంట్లో ఎంతో నీరసంగా ఉందని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కోంది.

ఇక ఇలియానా ప్రెగ్నంట్ అని తెలుసు కాని..ఆ బిడ్డకు తండ్రి ఎవరు..? ఈ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఇలియానా. రెండు మూడు సార్లు.. సరిగ్గా ముఖం కనిపించని ఫోటోలు పెట్టి కన్ఫ్యూజ్ చేసింది కాని.. అసలు ఫోటోలు మాత్రం రిలీజ్ చేయలేదు. ఇక ప్రస్తుతం తను బిడ్డను కంటున్నసందర్భంగానో ఏమో.. తన ప్రియుడిని పరిచయం చేసింది బ్యూటీ.. ఎట్టకేలకు ఈ బ్యూటీ తన ప్రియుడి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

డేట్‌ నైట్‌(Date Night) అంటూ లవ్‌ సింబల్‌ను జత చేసి ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను మొదటి సారి ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) స్టోరీలో పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. అయితే ఆయన ఎవరు అనే విషయాన్ని మాత్రం గోవా బ్యూటీ చెప్పలేదు. డీటెయిల్స్ తెలియకపోతేనేం.. తన బిడ్డకు తండ్రి ఫలానా అంటూ చెప్పేసినట్టే అని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్.

ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది బ్యూటీ. జీరో సైజ్ నడుముతో.. కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానాతొలి సినిమాతోనే తెలుగులో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత పోకిరితో(Pokiri) ఇండస్ట్రీ హిట్‌ సాధించింది. ఈ సినిమా తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్‌ హిట్లతో అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది.

Updated On 18 July 2023 2:09 AM GMT
Ehatv

Ehatv

Next Story