2024లో తన అనుభవాలను ఇలియానా వీడియో రూపంలో విడుదల చేసింది. జనవరి నుంచ డిసెంబర్ వరకు తన జీవితంలో ఏం జరిగిందో వివరించింది.

2024లో తన అనుభవాలను ఇలియానా వీడియో రూపంలో విడుదల చేసింది. జనవరి నుంచ డిసెంబర్ వరకు తన జీవితంలో ఏం జరిగిందో వివరించింది. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తనకు కొడుకుతోనే క్షణం తీరిక లేకుండా పోయిందని తెలిపింది. తన పిల్లాడితోనే సరిపోయిందని చెప్పింది. అయితే సెప్టెంబర్‌లో మాత్రం తాను రెండో సారి గర్భం దాల్చినట్లు ప్రెగ్నెన్సీ కిట్‌ను చూపించింది. దీంతో ఇలియానాకు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2025లో మీ ఇంటికి మరో బుజ్జి పాప లేదా బాబు రాబోతున్నారని కామెంట్స్ చేశారు. తన ప్రియుడైన మైఖేల్‌ డోలన్‌ను ఇలియానా పెళ్లి చేసుకుంది. కొన్నేళ్ల పాటు తన భర్త గురించి వివరాలు చెప్పలేదు. 2023లో కొడుకు పుట్టిన తర్వాత తన భర్త మైఖేల్‌ పూర్తి ఫోటోను విడుదల చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తొలి చిత్రం దేవదాసుతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్లింది. పోకిరి, మున్నా, రాఖీ, ఆట, జల్సా, కిక్‌ వంటి సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళలంలో జోరు మీదున్న ఇలియానా బాలీవుడ్‌లో బర్ఫీ మూవీకి అవకాశం వచ్చింది. ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఇలియానా అక్కడే వరుస సినిమాలు చేసింది. సౌత్‌ ఇండస్ట్రీకి ఆమె తిరిగి రాలేదు. ఆ తర్వాత పెళ్లి, పిల్లలతో ఆమె ఇండస్ట్రీకి దూరమైంది.

ehatv

ehatv

Next Story