ఇప్పుడున్న నటులలో కమల్‌హాసన్‌కున్న నటానుభవం మరెవరికీ లేదు. సమీప భవిష్యత్తులో ఉంటుందన్న నమ్మకం కూడా లేదు. సుమారు 60 ఏళ్ల అనుభవం ఆయనది! ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సకలకళావల్లభుడు. దర్శకుడు, గాయకుడు, రచయిత కూడా! తమిళంలోనే కాదు, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ వంటి పలు భాషల్లో నటించారు.
ఇప్పుడున్న నటులలో కమల్‌హాసన్‌కున్న(Kamal hassan) నటానుభవం మరెవరికీ లేదు. సమీప భవిష్యత్తులో ఉంటుందన్న నమ్మకం కూడా లేదు. సుమారు 60 ఏళ్ల అనుభవం ఆయనది! ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సకలకళావల్లభుడు. దర్శకుడు, గాయకుడు, రచయిత కూడా! తమిళంలోనే కాదు, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ వంటి పలు భాషల్లో నటించారు. సినిమాలలో ఈయన చేసినన్ని ప్రయోగాలు మరో నటుడు చేయలేదు. అంత సాహసం చేయలేరు కూడా! అన్ని భాషల్లో కలిపి ఇప్పటికే 232 సినిమాలలో నటించిన కమలహాసన్ ఇటీవల తన సొంత బ్యానర్‌లో నిర్మించి, హీరోగా నటించిన విక్రమ్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.
రికార్డు కలెక్షన్లను సాధించింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఇండియన్– 2 కమలహాసన్‌కు 233వ చిత్రం అవుతుంది. తర్వాత తన 234 చిత్రాన్ని మణిరత్నం దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక నిర్మాతగాను నటుడు ధనుష్, శింబు, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన బోల్డన్నీ అవార్డులను సొంతం చేసుకున్నారు. కేంద్రప్రభుత్వం పద్మశ్రీ(Padma sri), పద్మవిభూషణ్(Padmavibhushan) వంటి అవార్డులతో కమల్‌ను సత్కరించింది. ఇక ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై జీవిత సాఫల్య(Life achievement) అవార్డును అందుకోబోతున్నారు. ఈ నెల 27న అబుదాబిలో(Abu Dhabi) జరిగే అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవంలో కమలహాసన్‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందచేయబోతున్నారు.