ఎలాంటి అంచనాలు లేకుండా లాస్టియర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం(Sita Ramam) సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్(Dulqer salman), హీరోయిన్ మృణాళ్ ఠాకూర్(Mrunal Thakur) తెలుగువారికి ఆత్మీయులుగా మారిపోయారు. హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.
ఎలాంటి అంచనాలు లేకుండా లాస్టియర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం(Sita Ramam) సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్(Dulqer salman), హీరోయిన్ మృణాళ్ ఠాకూర్(Mrunal Thakur) తెలుగువారికి ఆత్మీయులుగా మారిపోయారు. హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. సీతగా మృణాళ్ ఠాకూర్, రామ్‌గా దుల్కర్ సల్మాన్ నటించారు. ఈ రొమాంటిక్ పిరియాడిక్ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రంగా(Best Movie) నిలిచింది. మెల్‌బోర్న్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలు ఈ నెల 20 వరకు జరగనున్నాయి. అవార్డు రావడంతో చిత్ర యూనిట్ సంబరాలలో మునిగిపోయింది. శుక్రవారం పలు విభాగాలకు సంబంధించిన అవార్డులను IFFM టీమ్ ప్రకటించింది. బాలీవుడ్‌కి నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్, హీరో కార్తీక్ ఆర్యన్, నటి మృణాల్ ఠాకూర్, నటుడు విజయ్ వర్మ తదితరులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్తమ వెబ్ సిరీస్ విభాగంలో జూబ్లీ అవార్డు గెల్చుకుంది. ఉత్తమ డాక్యుమెంటరీగా టు కిల్ ఏ టైగర్ నిలిచింది. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వేలో అదిరిపోయే నటనతో మెప్పించిన రాణీ ముఖర్జీకి బెస్ట్ యాక్టర్ (ఫిమేల్) అవార్డు దక్కింది. పురుషుల విభాగంగా మోహిత్ అగర్వాల్‌కు (ఆగ్రా) బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. పృథ్వీ కొననూర్‌కు బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు వరించింది. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ డైవర్సిటీ అవార్డు అందుకున్నారు.