పుష్ప సినిమా(Pushpa Movie)తో అల్లు అర్జున్(Allu Arjun) పేరు ఖండాంతరాలు దాటింది. ఒక్కసారిగా ఆయన పాన్ ఇండియా స్టార్(Pan India Star)గా అవతరించాడు. సుకుమార్ డైరెక్షన్(Director Sukumar)లో వచ్చిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఇందులోని పాటలు దేశమంతటా మారుమోగాయి. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ పుష్ప-2 (Pushpa 2)షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

Allu Arjun – Srikanth Odela Movie
పుష్ప సినిమా(Pushpa Movie)తో అల్లు అర్జున్(Allu Arjun) పేరు ఖండాంతరాలు దాటింది. ఒక్కసారిగా ఆయన పాన్ ఇండియా స్టార్(Pan India Star)గా అవతరించాడు. సుకుమార్ డైరెక్షన్(Director Sukumar)లో వచ్చిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఇందులోని పాటలు దేశమంతటా మారుమోగాయి. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ పుష్ప-2 (Pushpa 2)షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్(Hyderabad)లో కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్(Trivikram)దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ చిత్రాన్ని చేయనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు వచ్చిన మూడు సినిమాలు ఘన విజయం సాధించాయి. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం సినిమాల తర్వాత వీరిద్దరు కలిసి చేయబోయే నాలుగో సినిమా ఇది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట! దసరా సినిమాతో ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) ఈ సినిమాను రూపొందించబోతున్నారట. ఇటీవల అల్లు అర్జున్- శ్రీకాంత్ ఓదెల మధ్య కథా చర్చలు జరిగాయని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథాంశం అల్లు అర్జున్‌కు బాగా నచ్చిందని అంటున్నారు. త్రివిక్రమ్‌తో చేయనున్న సినిమా పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తారని చెబుతున్నారు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది ఆఖరిలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లే అవకాశం ఉందట! తెలిసింది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు. మరోవైపు పుష్ప: ది రూల్ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఓ రిసార్ట్‌లో జరుగుతోంది. అల్లు అర్జున్, రష్మికా మందన్నాలతో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. సినిమాలో ఇది పార్టీ సాంగ్‌గా ఉంటుందని ఫిల్మ్ నగర్‌లో టాక్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అదిస్తున్నాడు.
