టాలీవుడ్ ఐకాన్ స్టార్(Allu arjun), 'పుష్ప'(Pushpa) హీరో అల్లు అర్జున్ భారతదేశంలో అత్యధిక పారితోషికం(Remuneration) తీసుకునే నటుడిగా నిలిచాడు.
టాలీవుడ్ ఐకాన్ స్టార్(Allu arjun), 'పుష్ప'(Pushpa) హీరో అల్లు అర్జున్ భారతదేశంలో అత్యధిక పారితోషికం(Remuneration) తీసుకునే నటుడిగా నిలిచాడు. షారూఖ్ ఖాన్(Shah rukh khan), తలపతి విజయ్(Thalapathy vijay), ప్రభాస్(Prabhas) వంటి హీరోలను అల్లు అర్జున్ అధిగమించాడు. అర్జున్ పారితోషికం ఇప్పుడు అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల బాక్సాఫీస్ వసూళ్లను మించిపోయిందని అంటున్నారు. అల్లు అర్జున్ 'పుష్ప 2' కోసం తన ఫీజుగా రూ. 300 కోట్లు వసూలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం అనేక హిట్ చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్‌లను అధిగమించడమే కాకుండా ఇతర అగ్ర తారల రెమ్యునేరేషన్లను మించి దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటునిగా చేసింది. 2021లో 'పుష్ప' విడుదలైన తర్వాత అల్లు అర్జున్ దేశంలో పాపులర్ నటుడిగా గుర్తింపు పొందారు. కరోనా మహమ్మారి కారణంగా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా మంచి ప్రదర్శన కనబరిచి భారీ విజయాన్ని సాధించింది. తొలి భాగం విజయంతో భారీ అంచనాలున్న సీక్వెల్ 'పుష్ప 2: ది రూల్' ఈ ఏడాది విడుదల కానుంది. అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం పుష్ఫ 2. సుమారు మూడేళ్ల క్రితం రిలీజై సంచలనం సృష్టించిన పుష్ఫ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 5న ఈ పాన్ ఇండియా సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. పాట్నాలో భారీ వేదికను నిర్మించి వేలాది మంది