షారుఖ్ ఖాన్ (Shah Rukh khan) హీరోగా అట్లీ కుమార్ (Atlee Kumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ (Jawan) సినిమాలో నయనతార (Nayanthara) హీరోయిన్‏గా నటిస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్ అండ్ హాట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జవాన్ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేమియో రోల్ చేస్తున్నాడట.

షారుఖ్ ఖాన్ (Shah Rukh khan) హీరోగా అట్లీ కుమార్ (Atlee Kumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ (Jawan) సినిమాలో నయనతార (Nayanthara) హీరోయిన్‏గా నటిస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్ అండ్ హాట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జవాన్ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేమియో రోల్ చేస్తున్నాడట. ఈ వార్తను 6.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఫిలిమ్ ఫేర్ మ్యాగజైన్ ట్వీట్ చేసింది. అయితే దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది ఫేక్ న్యూస్ అని.. మరికొందరు జవాన్ చిత్రం షూటింగ్ గుమ్మడికాయ కొట్టేందుకు దగ్గరలో ఉందని మరికొందరు అంటున్నారు.

ఇదిలా ఉంటే రీసెంట్‏గా జవాన్ చిత్రంలో సాంగ్‏లో కీలకమైన రిమాన్స్ సీన్ లీక్ అయింది.. ఆ వీడియోలో కొద్ది రోజులు నె(న)ట్టింట వైరల్ అయింది. ఈ జవాన్ (Jawan) సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్‏మెంట్స్ (Red Chillies Entertainment) బ్యానర్‏పై నిర్మిస్తున్నారు. యూత్ ఐకాన్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, విజయ్ సేతుపలి, నయనతార, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగిబాబు, దీపికా పదుకొనే ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు. స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న కమర్షియల్ ఎంటర్‏టైనర్‏గా ఈ ఏడాది జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ జవాన్ చిత్రం.

Updated On 21 April 2023 6:19 AM GMT
Ehatv

Ehatv

Next Story