Bappam Tv : ఐ బొమ్మ పోయి బప్పం టీవీ వచ్చే ఢాం ఢాం ఢాం!

సినిమా(cinema) టికెట్ల రేట్లు మధ్య తరగతివారికైతే భారంగానే మారుతున్నాయి. ఫ్యామిలీతో సినిమాకు వెళితే ఎంత లేదన్నా రెండు వేల రూపాయలు హాంఫట్‌ అవుతున్నాయి. అందుకే చాలా మంది తప్పని తెలిసినా వివిధ సైట్ల నుంచి సినిమాలను(website) డౌన్‌లోడ్‌ చేసి చూసుకుంటున్నారు. ఇలాంటి వారికి ఐ బొమ్మ గురించి బాగా తెలుసు. ఏ భాషలో వచ్చిన సినిమాను అయినా సరే ఈ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కొంత ఆలస్యమైతే కావొచ్చు కానీ బొమ్మ అయితే ఫ్రీగా చూసుకోవచ్చు కదా! కొద్ది రోజుల నుంచి ఈ సైట్‌ పేరులో మార్పు కనిపిస్తోంది. సైటును కూడా సాంకేతికంగా అభివృద్ధి చేశారు. దాంతో పాటు ఐ బొమ్మకు(I bomma) బదులు bappam.tv అనే పేరును కొత్తగా చేర్చారు. ఇప్పుడు బప్పం టీవీ అని బ్రౌజ్‌ చేయగానే ఐ బొమ్మ సైట్ ప్రత్యక్షం అవుతోంది. కాకపోతే., ఐ బొమ్మ సైట్ గా పేరు ఉన్నప్పుడు ఏ విధంగా పేజీ ఉందొ.. ఇప్పుడు ఓపెన్ చేయగానే ఆ విధంగానే పేజ్ ఓపెన్ అవుతుంది. దాని ముందు బప్పం టీవీ అని మాత్రం కనబడుతుంది.

Eha Tv

Eha Tv

Next Story