మత మార్పిడులపై ఐఎఎస్‌(IAS) అధికారి నియాజ్‌ ఖాన్‌(NIiaj Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh) క్యాడర్‌కు చెందిన ఖాన్‌ మత మార్పిడులకు(Religion change) బాలీవుడ్‌నే(Bollywood) బాధ్యుడిని చేయాలన్నారు. నిజానికి మత మార్పిడులు శ్రేయస్కరం కాదన్నారు. మత మార్పిడులు బాలీవుడ్‌ నుంచే మొదలయ్యాయన్నారు. బడా బడా ముస్లిం యాక్టర్లు హిందువులను

మత మార్పిడులపై ఐఎఎస్‌(IAS) అధికారి నియాజ్‌ ఖాన్‌(NIiaj Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh) క్యాడర్‌కు చెందిన ఖాన్‌ మత మార్పిడులకు(Religion change) బాలీవుడ్‌నే(Bollywood) బాధ్యుడిని చేయాలన్నారు. నిజానికి మత మార్పిడులు శ్రేయస్కరం కాదన్నారు. మత మార్పిడులు బాలీవుడ్‌ నుంచే మొదలయ్యాయన్నారు. బడా బడా ముస్లిం యాక్టర్లు హిందువులను పెళ్లి చేసుకుని అటు పిమ్మట వారిని ముస్లింలుగా మార్చేసిన వైనాన్ని మనం చూశాం కదా అని ఖాన్‌ వివరించారు. ఇప్పటికే అదే జరుగుతోంది. మాత మార్పిడి అన్నది చాలా పెద్ద తప్పని భావిస్తున్న మనమే మన మతమే అన్నింటి కంటే గొప్పదని అనుకుంటున్నామని ఖాన్‌ తెలిపారు.

మరో మతాన్ని తక్కువగా చూడటం తగని పని అని పేర్కొన్నారు. 'మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అన్ని మతాలు సమానం. పెళ్లి తర్వాత నా మతంలోకి మారాలని ఎలా చెప్పగలం? భార్యభర్తలిద్దరూ వారివారి మతాలను అవలంబిస్తుండాలి. నీకు అవతలి వ్యక్తి ఆచరిస్తున్న మతం గొప్పదని భావిస్తే దానిని గౌరవించాలి. అంతే తప్ప మతం మారడం అన్నది సరికాదు' అని నియాజ్‌ ఖాన్‌ తెలిపారు.
మతమార్పిడులకు నూటికి నూరుశాతం బాలీవుడే కారణం. బాలీవుడ్‌ హీరోలను చాలా మంది రోల్‌ మోడల్‌గా తీసుకుంటారు. ప్రజలు కళాకారులను దేవుళ్లుగా భావిస్తారు. ప్రజలిప్పుడు పాశ్చాత్య సంస్కృతిని అనుకరిస్తున్నారు. అది సినిమాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మనిషి మెదళ్లను తొలచివేసే హింస, సెక్స్‌ సినిమాల్లో పెద్ద పీట వేస్తున్నాయి. యువతను నాశనం చేస్తున్నాయి.

'హాలీవుడ్‌ను అనుకరించడం మానేసి కాసింత దేశభక్తిని అలవర్చుకుంటే బాలీవుడ్‌కు మంచిది. అప్పుడే ఈ దురాచారం అంతరిస్తుంది. హిందీ సినిమా పరిశ్రమ మన దేశ సంస్కృతిని చెడగొడుతోంది. పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది' అని ఖాన్‌ తెలిపారు. తాను ట్వీట్‌ చేసిన మూడు విషయాల గురించి చెబుతూ మొదటిది ముస్లింలు గో సంరక్షులుగా మారాలి. రెండోది వారు శాకాహారం తీసుకోవాలి. అయితే ఇందులో బలవంతమేమి లేదు. ఇష్టం ఉన్నవాళ్లు తింటారు. లేనివాళ్లు మానేస్తారు.

మూడోది బ్రాహ్మణులతో సత్సంబంధాలు పెంచుకోవాలి. గో సంరక్షకులంటే ముస్లింలకు ఎంతో గౌరవమని, చాలా మంది ముస్లింలు ఆవులకు కడుపు నిండా ఆహారం పెడతారని, వాటి దప్పికను కూడా తీరుస్తారని వివరించారు. శాకాహారం తీసుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా బాగా పెరుగుతోంది కానీ తిండి విషయంలో బలవంతమేమీ ఉండకూడదు. ఎవరికి ఇష్టమైనది వారు తినవచ్చు అని నియాజ్‌ తెలిపారు. ఇక బ్రాహ్మణులతో సత్సంబంధాలు కలిగి ఉండటం చాలా మంచిదన్నారు. బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ సత్య మార్గాన్ని అనుసరిస్తూ దేశాన్ని నడిపిస్తూ మార్గ నిర్దేశం చేస్తున్నాడని వివరించారు.

Updated On 9 Jun 2023 4:55 AM GMT
Ehatv

Ehatv

Next Story