కొరటాల డైరెక్న్ లో.. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా దేవర. వీరిద్దరి కాంబినేషన్లో 'దేవర రెండో సినిమాగా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో ఈమూవీ రూపొందుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ - యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

దేవర కోసం భారీగా ప్లాన్లు వేస్తున్నారు.. అదిరిపోయే సెట్టింగ్ లు .. కోట్ల కు కోట్లు బడ్జెట్ గుమ్మరిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ కోసం మరో సెట్టు రెడీఅవుతోంది.

కొరటాల డైరెక్న్ లో.. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా దేవర. వీరిద్దరి కాంబినేషన్లో 'దేవర రెండో సినిమాగా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో ఈమూవీ రూపొందుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ - యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కల్యాణ్ రామ్ కూడా భాగస్వామిగా ఉన్నారు. ఈసినిమా నిర్మాణంలో. ఇక పాన్ ఇండియా స్థాయిలో.. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

ఇక ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ కి పరిచయమవుతోంది. సౌత్ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది.దేవర మూవీలో జాన్వీ మత్స్యకారుల కుటుంబానికిచెందిన అమ్మాయిగా నటింస్తోంది. అంతే కాదు యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈమూవీలో జాన్వీకి కూడా యాక్షన్ సీన్స్ ఉంటాయిన తెలుస్తోంది. ఈక్రమంలో ఈమూవీ షూటింగ్ కోసం రకరకాల సెట్లు ప్లాన్ చేశారు. అందులో భారీ సెట్లే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా మరో పెద్ద సెట్ట్ ను ప్లాన్ చేస్తున్నారట.

ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగు దశలో ఉంది. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేసినట్టు సమాచారం. అక్కడ ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూటింగ్ చేస్తారని సమాచారం. అందుకోసం ప్రత్యేకంగా ఒక సెట్ వేయించినట్టు చెబుతున్నారు.ఈ సెట్లో చిత్రీకరించే యాక్షన్ సీన్ .. ఇంటర్వెల్ బ్యాంగ్ గా వస్తుందని అంటున్నారు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. శ్రీకాంత్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.

Updated On 6 Dec 2023 7:17 AM GMT
Ehatv

Ehatv

Next Story