పఠాన్ సినిమాలో షారుఖ్ సల్మాన్ ఖాన్ సీన్ రాగానే ఫ్యాన్స్ ఎంత సందడి చేశారో తెలిసిందే. ఇక పఠాన్ లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత.. యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న స్పై మూవీ సల్మాన్ ఖాన్ క్రేజీ ప్రాజెక్ట్.. టైగర్ 3. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కిసీకా జాన్.. కిసీకా బాయ్ సినిమాతో నిరాశ ఎదురవ్వడంతో.. ఈసినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు సల్మాన్. అంతే కాదు ఈమూవీపై రోజు రెజుకు అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. అసలే సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న సల్మాన్ టైగర్ 3తో ఎలా అయినా బ్లాక్ బస్టర్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు.

షారుఖ్(Shah Rukh), సల్మాన్ (Salman Khan) ఇద్దరు ఒక సినమాలో ఉన్నారంటే..ఆసినిమా ఏరేంజ్ లో ఉండాలి..సరిగ్గా మేకర్స్ కూడా ఇలానే ఆలోచించినట్టున్నారు. సల్మాన్ టైగర్ 3లో ఈ ఇద్దరి స్టార్ల ఓక్క సీన్ కోసం కోట్లు ఖర్చు చేశారట. ఇంతకీ ఎంత బడ్జెట్ పెట్టారంటే.

పఠాన్ (Pathaan) సినిమాలో షారుఖ్ సల్మాన్ ఖాన్ సీన్ రాగానే ఫ్యాన్స్ ఎంత సందడి చేశారో తెలిసిందే. ఇక పఠాన్ లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత.. యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న స్పై మూవీ సల్మాన్ ఖాన్ క్రేజీ ప్రాజెక్ట్.. టైగర్ 3. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కిసీకా జాన్.. కిసీకా బాయ్ సినిమాతో నిరాశ ఎదురవ్వడంతో.. ఈసినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు సల్మాన్. అంతే కాదు ఈమూవీపై రోజు రెజుకు అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. అసలే సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న సల్మాన్ టైగర్ 3తో ఎలా అయినా బ్లాక్ బస్టర్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు.

అందుకే టైగర్ 3ని అందరి అంచనాలను మించి రెడీ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈసినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లను భారీ స్థాయిలో ప్లాన్ చేశారట. దానికోసం బడ్జెట్ కూడా భారీగా పెడుతున్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం టైగర్ 3 భారీ యాక్షన్ షూట్ కోసం దాదాపు పాతిక కోట్లు ఖర్చు పెడుతున్నారట మూవీ టీమ్. ఒక్క యాక్షన్ సీన్ కే .. చిన్న సినిమా బడ్జెట్ అంత ఖార్చు పెడుతున్నారు అంటే.. సినిమా ఏరేంజ్ లో ఉంటుందో తెలుసుకోవచ్చు.

అంతే కాదు ఈసినిమా సెట్స్ కోసం కూడా కొన్ని కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు. టైగర్ 3 కోసం అన్ని రకాల కసరత్తులు చేస్తున్నారు సల్మాన్. సినిమాని ఎట్టి పరిస్తితుల్లో సక్సెస్ చెయ్యడానికి సినిమా రేంజ్ ని పెంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబందించి లేటెస్ట్ గా మడ్ ఐలాండ్ లో 25 కోట్లతో సెట్ రెడీ చేసి యాక్షన్ సీక్వెన్స్ తీయబోతున్నారు.

యశ్ రాజ్ స్పై ఫిలిమ్స్ లో భాగంగా టైగర్ 3లో షారుఖ్ ఖాన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం వీరి మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్ కోసమే.. 25 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. పఠాన్ లో క్యామియో రోల్ ప్లే చేశారు సల్మాన్. ఆ సీక్వెన్స్ బాగా క్లిక్ అయింది. ఇప్పుడు టైగర్ 3 లో షారూఖ్ కూడా మాంచి యాక్షన్ సీన్స్ లో కలిసి ఆడియన్స్ కి యాక్షన్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు.గతంలో పఠాన్ క్రియేట్ చేసిన అంచనాలు అన్నీ ఇన్నీ కావు. యాక్షన్ స్టంట్స్ తో అదరగొట్టిన పఠాన్ ని బీట్ చెయ్యాలన్న టార్గెట్ తో వెళ్తున్నారు టీమ్.

Updated On 15 May 2023 5:02 AM GMT
Ehatv

Ehatv

Next Story