ఈమధ్య బాలీవుడ్ స్టార్స్ సమాన్యులతో కలిసి సందడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ముంబయ్ నగరంలో పెరిగిన ట్రాఫిక్ కష్టాలకు(Mumbai Traffic) తట్టుకోలేక. స్టార్లు కూడా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పై ఆధారపడుతున్నారు. అది కూడా మెట్రో ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

Hrithik Roshan In Metro
ఈమధ్య బాలీవుడ్ స్టార్స్ సమాన్యులతో కలిసి సందడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ముంబయ్ నగరంలో పెరిగిన ట్రాఫిక్ కష్టాలకు(Mumbai Traffic) తట్టుకోలేక. స్టార్లు కూడా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పై ఆధారపడుతున్నారు. అది కూడా మెట్రో ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్య బాలీవుడ్ స్టార్లు హేమా మాలిని(Hema Malini).. సోనూ సూద్(Sonu Sood) లాంటివారు మెట్రోలో ప్రయాణించగా.. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు హృతిక్(Hrithik Roshan) కూడా అదే పని చేశారు.
ట్రాఫిక్ కష్టాలు తప్పించుకునేందుకు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాజాగా ముంబై మెట్రోలో(Mumbai Metro) ప్రయాణించారు. అంతటి నటుడు మెట్రోలో ప్రయాణిస్తారని ఊహించని ప్రయాణికులు హృతిక్‌ను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అనేక మంది ఆయనతో సెల్ఫీలు కూడా దిగేందుకు ఉత్సాహం చూపించారు. అభిమానులతో దిగిన ఫొటోలను హృతిక్ నెట్టింట షేర్ చేశారు.
షూటింగ్ కోసం బయలుదేరానని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. యాక్షన్ సన్నివేశాల ముందు ట్రాఫిక్‌లో చిక్కుకుని వెన్నునొప్పి తెచ్చుకొనే బదులు ఇలా మెట్రోను ఎంచుకున్నట్టు సరదా వ్యాఖ్యలు చేశారు. మెట్రో ప్రయాణికులు తనపై ఎంతో అభిమానం కురిపించారని చెప్పుకొచ్చారు. ఇదో అద్భుతమైన అనుభవమని పేర్కొన్నారు. ఎండవేడి, ట్రాఫిక్ సమస్య ఒకేసారి తప్పిపోయాయని కామెంట్ చేశారు.
