బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan) గాయపడ్డాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) ద్వారా ఈ విషయాన్ని ఆయనే తెలిపాడు. నడుముకు ఒక బెల్ట్‌ పెట్టుకుని క్రచెస్‌(crutches) సాయంతో నిలుచున్న ఓ ఫోటోను జత చేశారు. చూడబోతే హృతిక్‌కు తీవ్రమైన గాయాలే అయ్యాయని అనిపిస్తోంది. ఇంతకు ముందు మీలో ఎంతమందికి ఈ క్రచెస్‌, వీల్‌ చైర్‌ అవరసమెచ్చింది? ఆ సమయంలో మీ ఫీలింగ్‌ ఏంటి? అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు హృతిక్‌ రోషన్‌. కాలి గాయంతో(Injury) కలిగిన బాధ నుంచి ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని తెలిపారు

బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan) గాయపడ్డాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) ద్వారా ఈ విషయాన్ని ఆయనే తెలిపాడు. నడుముకు ఒక బెల్ట్‌ పెట్టుకుని క్రచెస్‌(crutches) సాయంతో నిలుచున్న ఓ ఫోటోను జత చేశారు. చూడబోతే హృతిక్‌కు తీవ్రమైన గాయాలే అయ్యాయని అనిపిస్తోంది. ఇంతకు ముందు మీలో ఎంతమందికి ఈ క్రచెస్‌, వీల్‌ చైర్‌ అవరసమెచ్చింది? ఆ సమయంలో మీ ఫీలింగ్‌ ఏంటి? అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు హృతిక్‌ రోషన్‌. కాలి గాయంతో(Injury) కలిగిన బాధ నుంచి ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని తెలిపారు. ఇదిలా ఉంటే హృతిక్‌ త్వరగా కోలుకోవాలని టైగర్ ష్రాఫ్‌(Tiger shroff), వరుణ్‌ ధావన్‌(Varun dhawan) వంటి స్టార్స్‌తో పాటు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఫైటర్‌ షూటింగ్‌ సమయంలో హృతిక్‌కు ప్రమాదం జరిగి ఉండవచ్చని అంటున్నారు. ఆయ కాలికి గాయం కావడంతో కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. ఫలితంగా వార్‌ -2(War-2) సినిమా షూటింగ్‌ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వార్‌-2లో ఎన్టీఆర్‌(NTR) ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే! వార్‌ సినిమాలో హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ హీరోలుగా నటించారు. సినిమా ఘన విజయం సాధించింది. కొనసాగింపుగా వార్‌-2 తీసయాలని అనుకున్నారు. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించనున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ ‌ డేట్స్‌ కూడా ఇచ్చేశారు. త్వరలో షూటింగ్‌ అనుకుంటున్న సమయంలో హృతిక్‌ రోషన్‌కు గాయం కావడంతో ఈ ప్రాజెక్ట్‌ మరింత ఆలస్యం కావచ్చు అని తెలుస్తోంది.

Updated On 15 Feb 2024 5:28 AM GMT
Ehatv

Ehatv

Next Story