ప్రభాస్‌ .. ఈ మూడక్షరాలు ఓ అట్రాక్షన్‌! ఓ వైబ్రేషన్‌! ఓ సెన్సేషన్‌!

ప్రభాస్‌ .. ఈ మూడక్షరాలు ఓ అట్రాక్షన్‌! ఓ వైబ్రేషన్‌! ఓ సెన్సేషన్‌! ఈశ్వర్‌ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్‌ బాహుబలితో తన స్టామినా ఏమిటో రుజువు చేసుకున్నాడు. ఇవాళ ఆ యంగ్‌ రెబల్‌స్టార్‌ డార్లింగ్‌ పుట్టిన రోజు. ఆయన గురించి కొత్తగా చెప్పడానికి ఏముందని! అయినా బర్త్‌డే కాబట్టి పునశ్చరణ అవసరమే! ప్రభాస్‌ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు(Uppalapati venkata sathyanarayana Prabhas Raju). ఇంత పెద్ద పేరు పిలవడం కష్టం కాబట్టి ముద్దుగా ప్రభ, డార్లింగ్‌ అని పిలిచేవారు. సినిమాల్లోకి వచ్చాక ప్రభాస్‌(Prabhas) అయ్యాడు. అసలు సినిమాల్లోకి రావాలని ప్రభాస్‌ ఎప్పుడూ అనుకోలేదు. పైగా సినిమాలంటే చచ్చేంత భయం కూడానూ! పెదనాన్న కృష్ణంరాజు సినిమా షూటింగ్‌కు వెళ్లినప్పుడు సినిమా వాతావరణానికి అలవాటుపడ్డాడు. సినిమాల్లోకి రావాలని అనుకున్నాడు. 2002లో ఈశ్వర్‌(Eswar) సినిమాతో తెరంగ్రేటం చేశాడు. సినిమా మామూలు విజయాన్ని అందుకుంది. ఆ మరుసటి ఏడాది రాఘవేంద్ర వచ్చింది. ఇది ప్రభాస్‌ కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. కాకపోతే నటనలో ఈజ్‌ కనబరుస్తున్నాడనే పేరు తెచ్చుకున్నాడు. 2004లో వర్షం(Varsham) వచ్చింది. ఫస్ట్‌ వీక్‌ చాలా వీక్‌గానే నడిచిందీ సినిమా! ప్రభాస్‌ బాగా నిరాశ చెందాడు. వారం తర్వాత సినిమా ఊపందుకుంది. జనాలు థియేటర్ల దగ్గర బారులు తీరారు. కలెక్షన్ల వర్షం కుమ్మరించింది ఈ సినిమా. ప్రభాస్‌ కెరీర్‌లో తొలి ఘన విజయం ఇది. ఆ తర్వాత వచ్చిన అడవి రాముడు, చక్రం సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. 2005లో వచ్చిన ఛత్రపతి సినిమా బ్లాక్‌బస్టర్‌ అయ్యింది. ఈ సినిమా తర్వాత రెండేళ్ల వరకు ప్రభాస్‌కు ఒక్క హిట్‌ కూడా పడలేదు. పౌర్ణమి, యోగి, మున్నా సినిమాలు ఫెయిలయ్యాయి. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన బుజ్జిగాడు సినిమాతో ప్రభాస్‌ మళ్లీ రైజ్‌ అయ్యాడు. ఈ సినిమాలో ఆయన కనబర్చిన భిన్నమైన మ్యానరిజం ప్రేక్షకులకు బాగా నచ్చింది. బిల్లా, ఏక్‌ నిరంజన్‌, మిస్టర్‌ పరఫెక్ట్‌, మిర్చి సినిమాలు ప్రభాస్‌ను స్టార్‌ను చేశాయి. బాహుబలి సినిమా ప్రభాస్‌ను అంతర్జాతీయస్టార్‌ను చేసింది. ఏడాదికి రెండు సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్‌ బాహుబలి కోసం అయిదేళ్లు కాల్షీట్లు ఇచ్చేశాడు. ఆ అయిదేళ్లు మరో సినిమా ఒప్పుకోకుండా ఉన్న ఏకైక హీరో ప్రభాస్‌ మాత్రమే! ఇంతటి సాహసోపేత నిర్ణయం మరో నటుడు తీసుకోలేడు. బాహుబలితో ప్రభాస్‌ రేంజ్‌ అమాంతం పెరిగింది. పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు వచ్చింది. ఉత్తర భారతంలోనూ ప్రభాస్‌కు అభిమానులు పెరిగాయి. సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌, సలార్‌, కల్కి సినిమాలో ఉత్తరాదిలో కుమ్మేశాయి. ప్రముఖ మ్యూజియం మేడమ్‌ టుసాడ్స్‌లో మైనపు విగ్రహం కలిగిన మొదటి దక్షిణాది హీరో ప్రభాసే! 2014లోనే ప్రభాస్‌ ఓ హిందీ సినిమాలో నటించాడు. అజయ్ దేవ్‌గణ్‌, సోనాక్షి సిన్హా నటించిన యాక్షన్‌ జాక్సన్‌లో గెస్ట్ రోల్ పోషించాడు. ప్రభాస్‌కు షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, రాబర్ట్‌ డి నిరో, జయసుధ, శ్రియ, త్రిష అంటే చాలా ఇష్టం.

ehatv

ehatv

Next Story