ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుట్టిన రోజు నేడు.. అల్లు అర్జున్ పుష్ప(Pushpa Movie) సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. 'పుష్ప' అతని స్టార్‌డమ్‌ని ఓ రేంజ్‌లో పెంచింది. పాన్ ఇండియా లెవల్‌లో రూపొందిన ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్‌ హిట్‌గా నిలవడమే కాకుండా.. అల్లు అర్జున్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను విపరీతంగా పెంచింది. ఇప్పుడు బ‌న్నీకి సౌత్ నుండి బాలీవుడ్(Bollywood) వరకు బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అల్లు అర్జున్ ఇప్పటివరకు తన సినిమాలతో […]

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుట్టిన రోజు నేడు.. అల్లు అర్జున్ పుష్ప(Pushpa Movie) సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. 'పుష్ప' అతని స్టార్‌డమ్‌ని ఓ రేంజ్‌లో పెంచింది. పాన్ ఇండియా లెవల్‌లో రూపొందిన ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్‌ హిట్‌గా నిలవడమే కాకుండా.. అల్లు అర్జున్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను విపరీతంగా పెంచింది. ఇప్పుడు బ‌న్నీకి సౌత్ నుండి బాలీవుడ్(Bollywood) వరకు బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అల్లు అర్జున్ ఇప్పటివరకు తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. అయితే బ‌న్నీ వృత్తి జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం కూడా ఆసక్తికరంగా ఉంటుంది.

అల్లు అర్జున్.. స్నేహారెడ్డి(Sneha Reddy)ని 12 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. స్నేహ, అల్లు అర్జున్ ఇద్ద‌రిదీ ప్రేమ వివాహం. పేరున్న కుటుంబానికి చెందిన వాడైన అల్లు అర్జున్‌కు.. ప్రేమ వివాహం విష‌యంలో స్నేహ కుటుంబాన్ని ఒప్పించడం అంత ఈజీగా ఏం కుద‌ర‌లేదు. త‌నూ చాలామంది కుర్రాళ్ల‌లానే కష్టాన్ని చూశాడు.

Whats Allu Arjuns Favourite Food? Wife Sneha Reddy Shares In AMA Session - NDTV Food

అల్లు అర్జున్, స్నేహ తొలిసారి ఓ పెళ్లిలో కలుసుకున్నారు. అల్లు అర్జున్ కు స్నేహ తొలి చూపులోనే నచ్చింది. ఏం మాట్లాడాలో తెలియ‌దు. ప‌రిచ‌యం అయ్యింది. ఎలాగోలా ఇద్దరు నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. మెల్లగా స్నేహం ప్రేమగా మారింది. ఆ సమయంలో స్నేహ అమెరికా నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఇండియాకు తిరిగి వచ్చింది. ఆమెది వ్యాపార కుటుంబం. స్నేహ ఇండియా తిరిగొచ్చే సమయానికి అల్లు అర్జున్ కూడా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని ఉన్నాడు.

అల్లు అర్జున్ ఇండ‌స్ట్రీలో పేరున్న‌ కుటుంబానికి చెందినవాడు. నాన్న అల్లు అర‌వింద్(Allu Aravind) పెద్ద నిర్మాత‌, హీరో రామ్ చరణ్(Ram Charan) అతని కజిన్, చిరంజీవి(Chiranjeevi) మామ. అంత‌ పెద్ద కుటుంబం, బ్యాక్‌గ్రౌండ్ బ‌లంగా ఉన్న‌ప్పటికీ స్నేహ కుటుంబాన్ని ఒప్పించడం అల్లు అర్జున్‌కి అంత ఈజీగా అవ‌లేదు. ఓ ప‌క్క అల్లు అర్జున్ కుటుంబం ఐదు నిమిషాల్లో ఇరువురి వివాహానికి అంగీకరించింది.

Is Allu Arjun's Wife Sneha Reddy Foraying Into Films? Here's What We Know

అప్పుడు స్నేహ‌ కుటుంబాన్ని ఒప్పించే స‌మ‌యం వచ్చింది. ఇందుకు స్నేహ తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. స్నేహ తండ్రి వ్యాపారవేత్త అవ‌డంతో.. నటుడితో వివాహానికి ఇష్టం చూప‌లేదు. అయితే స్నేహ పట్టుదల ముందు కుటుంబ సభ్యులు అవుననే చెప్పాల్సి వచ్చింది. అలా ఒక్క‌టైన ఈ జంట‌కు ప్ర‌స్తుతం ఇద్దరు పిల్లలు. పేర్లు అయాన్, అర్హా. వీరు అప్పుడ‌ప్పుడు అల్లు అర్జున్ సినిమా పంక్ష‌న్‌ల‌లో క‌నిపిస్తుంటారు.

Updated On 7 April 2023 9:39 PM GMT
Yagnik

Yagnik

Next Story