హాంగాంగ్‌(Hangang)కు చెందిన ప్రముఖ గాయని కోకో లీ(Singer Coco Lee) కన్నుమూశారు. ఆమె వయసు 48 ఏళ్లు. కొంత కాలంగా ఆమె డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. ఈ నెల 4వ తేదీన ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. చికిత్స పొందుతూ కోకో లీ ఆసుపత్రిలోనే కన్నుమూశారు. హిడెన్‌ డ్రాగన్‌(Hidden Dragon)లోని ఎ లవ్‌ బిఫోర్‌ టైమ్‌ సాంగ్‌ ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యింది.

హాంగాంగ్‌(Hangang)కు చెందిన ప్రముఖ గాయని కోకో లీ(Singer Coco Lee) కన్నుమూశారు. ఆమె వయసు 48 ఏళ్లు. కొంత కాలంగా ఆమె డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. ఈ నెల 4వ తేదీన ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. చికిత్స పొందుతూ కోకో లీ ఆసుపత్రిలోనే కన్నుమూశారు. హిడెన్‌ డ్రాగన్‌(Hidden Dragon)లోని ఎ లవ్‌ బిఫోర్‌ టైమ్‌ సాంగ్‌ ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యింది. అవార్డుల ప్రదానోత్సవంలో ప్రదర్శన ఇచ్చిన తొలి చైనీస్‌ అమెరికన్‌గా కోకో లీ నిలిచారు. కోకో లీ గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతుందని.. దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించిందని ఆమె సిస్టర్స్‌ కరోల్‌, నాన్సీ పేర్కొన్నారు. ఇటీవల పరిస్థితి మరింత దిగజారిందని, ఈ క్రమంలోనే ఈ నెల 2వ తేదీన ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించిందన్నారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించామని, చనిపోయేంత వరకు కోకో లీ కోమాలోనే ఉందని వివరించారు. హాంకాంగ్‌లో జన్మించిన కోకోలీ తర్వాత అమెరికాకు వెళ్లారు. అక్కడ మిడిల్‌ స్కూల్‌లో చదువుకున్న కోకోలీ పాప్‌ సింగర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టారు. మూడు దశాబ్దాల సింగింగ్‌ కెరీర్‌లో కాంటోనీస్, ఆంగ్లంలో ఆల్బమ్‌లను కూడా విడుదల చేశారు. 1996లో సోనీ మ్యూజిక్‌తో ఒప్పందం చేసుకున్న తొలి చైనీస్ గాయనిగా నిలిచారు. ఆమె తర్వాతి ఆల్బమ్ కోకో లీ ఆసియాలో అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్‌గా నిలిచింది. 1997లో ఆమె మాండరిన్ ఆల్బమ్ సిన్సియర్‌తో పాటు కాంటోనీస్ ఆల్బమ్‌ను విడుదల చేసింది. 1998లో మాండరిన్ ఆల్బమ్ డి డా డి విడుదలవగా.. మూడు నెలల్లో మిలియన్‌ కాపీలు అమ్ముడయ్యాయి. ఆమె డిస్నీ మూలాన్ మాండరిన్ వెర్షన్‌లో హీరోయిన్ ఫా ములాన్‌కు గాత్రదానం చేసింది. రిఫ్లెక్షన్ అనే థీమ్ సాంగ్.. మాండరిన్ వెర్షన్‌ను పాడారు.

Updated On 6 July 2023 5:34 AM GMT
Ehatv

Ehatv

Next Story