తెలంగాణ(Telangana)లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం రావాలనే దృఢ సంకల్పంతో ఉన్న భారతీయ జనతా పార్టీ(BJP) అందుకోసం ఇప్పట్నుంచే వ్యూహరచన చేస్తోంది. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) కోసం సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే ఆదివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు శంషాబాద్(Shamshabad) చేరుకుంటారు.
తెలంగాణ(Telangana)లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం రావాలనే దృఢ సంకల్పంతో ఉన్న భారతీయ జనతా పార్టీ(BJP) అందుకోసం ఇప్పట్నుంచే వ్యూహరచన చేస్తోంది. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) కోసం సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే ఆదివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు శంషాబాద్(Shamshabad) చేరుకుంటారు. 3.50 గంటలకు శంషాబాద్ నోవాటెల్‌కు చేరుకుని, సాయంత్రం నాలుగు గంటల నుంచి 4.30 వరకు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా(RRR Movie) ఆస్కార్ విజేతల(Oscar Winners)తో తేనీటి విందులో పాల్గొంటారు. 5.15 గంటలకు అక్కడ నుంచి అక్కడ నుంచి చేవెళ్లకు రోడ్డు మార్గంలో వెళతారు. అక్కడ జరిగే ప్రవాస్ యోజన సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడ భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు.
ఇంతకు ముందు తెలంగాణకు వచ్చిన అమిత్ షా పార్టీ ముఖ్య నేతలకు కొన్ని కీలక బాధ్యతలను అప్పగించి వెళ్లారు. అందులో ముఖ్యమైనది చేరికల అంశం. ఇతర పార్టీల నుంచి చేరికలను వేగవంతం చేయాల్సిందిగా ఆదేశించి వెళ్లారు. అయితే ఇప్పటి వరకు పేరున్న నేతలెవ్వరూ బీజేపీలోకి వెళ్లలేదు. మునుగోడు ఉప ఎన్నికకు ముందు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారు. మొన్నీమధ్యన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి కమలదళ సభ్యుడయ్యారు. ఇంతకు మించి ముఖ్య నేతలెవరూ బీజేపీలో చేరలేదు. ప్రతీసారి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి చాలా మంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పడమే కానీ చేరికలు మాత్రం ఉండటం లేదు. చేవేళ్లలో జరిగే బహిరంగసభలో కొందరు నేతలు బీజేపీలోకి వస్తున్నారని బీజేపీ చెబుతున్నదే కానీ వారి పేర్లను ప్రకటించడం లేదు. బీఆర్‌ఎస్ నుంచి సస్పెండైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఏ పార్టీలో చేరతారో తెలియడం లేదు. వీరిద్దని లాగేసుకోవడానికి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు తెగ ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో ఆదివారంలోపు ఓ స్పష్టత వస్తుందన్న నమ్మకం లేదు. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముఖ్య నేత, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కూడా బీఆర్‌ఎస్‌కు టాటా చెప్పి తమ పార్టీలో చేరతారని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని, తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు మహేందర్‌రెడ్డి. మొత్తం మీద అమిత్ షా తెలంగాణ పర్యటన ఎప్పటిలాగే సాదాసీదాగా జరిగే అవకాశం కనిపిస్తోంది.