ఓరి దేవుడో... ఆర్టిఫిషీయల్‌ ఇంటలిజెన్స్‌(Artificial Intelligence) ఎంత పని చేస్తున్నదో కదా! ఇప్పటికే బోల్డంత మంది ఉద్యోగాలను ఊఫ్‌మని ఊదేసింది.. మొన్నటికి మొన్న ఏఐతో ఓ యాంకరమ్మను(Anchor) కూడా పుట్టించేశారు. ఏఐల కారణంగా ఎక్కడ ఉద్యోగం పీకిపారేస్తారేమోనని ఉద్యోగులు హడలిపోతున్నారు. ఆ భయంతోనే హాలీవుడ్‌ కూడా వణికిపోతుంది. అక్కడ సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి.

ఓరి దేవుడో... ఆర్టిఫిషీయల్‌ ఇంటలిజెన్స్‌(Artificial Intelligence) ఎంత పని చేస్తున్నదో కదా! ఇప్పటికే బోల్డంత మంది ఉద్యోగాలను ఊఫ్‌మని ఊదేసింది.. మొన్నటికి మొన్న ఏఐతో ఓ యాంకరమ్మను(Anchor) కూడా పుట్టించేశారు. ఏఐల కారణంగా ఎక్కడ ఉద్యోగం పీకిపారేస్తారేమోనని ఉద్యోగులు హడలిపోతున్నారు. ఆ భయంతోనే హాలీవుడ్‌ కూడా వణికిపోతుంది. అక్కడ సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. స్టార్ట్‌-కెమెరా-యాక్షన్‌ అనే మాటలు వినిపించడం లేదు. పెద్ద పెద్ద సినిమాలు ఆగిపోయాయి. వెబ్‌ సిరీస్‌లు బ్రేక్‌ తీసుకుంటున్నాయి. 63 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా నటీనటులు, రచయితలు, టెక్నిషియన్లు సమ్మెకు దిగారు. తమ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఏఐ నుంచి తమను కాపాడాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

ఆర్టిఫషీయల్‌ ఇంటలిజెన్స్‌ నుంచి తమకు ముప్పు ఉందని వీరు అంటున్నారు. తమ ఆందోళలనపై నిర్మాణ స్టూడియోలు(Studios), నిర్మాణ సంస్థలతో(Producing Organisations) జరిపిన చర్చలు విఫలం అవ్వడంతో స్క్రీన్‌ యక్టర్స్‌ గిల్డ్‌ సమ్మెకు(Actors Guild strike) దిగింది. దాదాపు 1,60,000 మంది నటీనటులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దాదాపు ఇవే డిమాండ్లతో గత 11 వారాలుగా సమ్మె చేస్తున్న రైటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ అమెరికా(Writers Guild of America) కూడా వీరితో జత కలిశారు. 1960లో అంటే సరిగ్గా 63 ఏళ్ల కిందట అప్పటి ప్రముఖ నటుడు రోనాల్డ్‌ రీగన్‌(Ronald Reagan) (తర్వాతి కాలంలో ఈయన అమెరికా అధ్యక్షులు అయ్యారు) సారథ్యంలో ఈ రెండు సంఘాలు కలిసి సమ్మె చేశాయి. మూడు నెలలకు పైగా జరిగిన ఈ సమ్మె కారణంగా భారీ సినిమాల విడుదల ఆలస్యం అయ్యింది. హాలీవుడ్‌ నష్టాలను చవిచూసింది.

Updated On 14 July 2023 7:37 AM GMT
Ehatv

Ehatv

Next Story