అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపన్‌హైమర్ జీవితం ఆధారంగా ఓపెన్‌హైమర్ అనే సినిమాను రూపొందించారు. ఇందులో ఓపెన్‌హైమర్ పాత్రను సిలియన్ మర్ఫీ పోషించారు. క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఓపన్‌హైమర్ పాత్రను అర్థం చేసుకోవడానికి సిలియన్ మర్ఫీ భగవద్గీతను చదవడం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అసలు భగవద్గీతకు, ఓపన్‌హైమర్ పాత్రకు సంబంధమేమిటి?

Cillian Murphy
అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపన్‌హైమర్ జీవితం ఆధారంగా ఓపెన్‌హైమర్ అనే సినిమాను రూపొందించారు. ఇందులో ఓపెన్‌హైమర్ పాత్రను సిలియన్ మర్ఫీ పోషించారు. క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఓపన్‌హైమర్ పాత్రను అర్థం చేసుకోవడానికి సిలియన్ మర్ఫీ భగవద్గీతను చదవడం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అసలు భగవద్గీతకు, ఓపన్‌హైమర్ పాత్రకు సంబంధమేమిటి? అంటే రెండో ప్రపంచయుద్ధం సమయంలో అణుబాంబు తయారు చేయడానికి ఓపన్‌హైమర్‌కు ప్రేరణనిచ్చింది భగవద్గీతనే అట! గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సృష్టించింది నేనే, నాశనం చేసింది నేనే అనే శ్లోకంతో రాబర్ట్ ఓపన్ హైమర్ ఎంతోగానో ప్రభావితులయ్యారట! ఆ ప్రేరణతోనే అణుబాంబుకు రూపకల్పన జరిగిందట! అందుకే ఓపన్ హైమర్ పాత్రను చేయడం కోసం భగవద్గీతను చదివానని సిలియన్ మర్ఫీ చెప్పుకొచ్చారు. ఓపెన్‌హైమర్ జీవితంలో కీలకంగా నిలిచిన అణు బాంబు తయారీ ప్రధానాంశంగా ఓపెన్ హైమర్‌ను రూపొందించారు. ఈ సినిమా యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా ఇంగ్లీషులో ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 21న విడుదల అవుతోంది.
